Diwali 2025 Gift Guide
Diwali 2025 Gift Guide : దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతిఒక్కరూ తమ ప్రియమైనవారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. మీరు కూడా ఏదైనా మంచి టెక్ గిఫ్ట్ కోసం చూస్తున్నారా? మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం అద్భుతమైన గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
2025 దీపావళికి సరైన గిఫ్ట్ కావాలంటే మీకు సరిగ్గా (Diwali 2025 Gift Guide) సరిపోయే 6 గాడ్జెట్‌లను అందిస్తున్నాం. ఈ గిఫ్ట్స్ డిజైన్ పరంగా పవర్‌ఫుల్ స్పీకర్ల నుంచి స్మార్ట్‌వాచ్‌లు, పాకెట్ సైజు పవర్ బ్యాంక్‌ల వరకు మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన టెక్ గాడ్జెట్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
1. సెల్లెకోర్ సీబీఎస్-05 ప్రో కామెట్ బ్లూటూత్ స్పీకర్ : ధర రూ. 5,499
సీబీఎస్-05 పీఆర్ఓ కామెట్ 80W సౌండ్ అవుట్‌పుట్, మల్టీ కనెక్టివిటీ మోడ్‌లు (బ్లూటూత్, AUX, USB, SD కార్డ్) 10-గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. TWS పెయిరింగ్, కరోకే (Karaoke) కోసం మైక్రోఫోన్ సపోర్టుతో కూడా వస్తుంది.
2. నాయిస్ ఎయిర్‌వేవ్ మ్యాక్స్ 4 హెడ్‌ఫోన్‌లు : ధర రూ. 1,699
నాయిస్ ఎయిర్‌వేవ్ మ్యాక్స్ 4 హెడ్‌ఫోన్‌లు ప్రీమియం సౌండ్ అందిస్తాయి. 70 గంటల ప్లేటైమ్, 10 నిమిషాల్లో 5 గంటల ఇన్‌స్టాచార్జ్, డ్యూయల్ పెయిరింగ్, క్రిస్టల్-క్లియర్ సౌండ్ కోసం 40mm డ్రైవర్లను అందిస్తాయి. మ్యూజిక్ మాత్రమే కాదు.. ఫోన్ కాల్‌లతో పాటు గేమింగ్‌కు అద్భుతమైన ఆప్షన్.
Read Also : Apple CEO Tim Cook : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో దీపావళి ఫొటో.. ఆపిల్ సీఈఓ ఫుల్ ఫిదా.. అద్భుతమంటూ పోస్టు..!
3. అంబ్రేన్ పవర్‌మినీ 20 పవర్‌బ్యాంక్ : ధర రూ. 1,699
ఈ పవర్‌బ్యాంక్ ముఖ్యంగా ప్రయాణికుల కోసం అందిస్తోంది. 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 20000mAh బ్యాటరీ, ఇంటర్నల్ టైప్-C కేబుల్‌ను కలిగి ఉంది. 2-3 స్మార్ట్‌ఫోన్‌లను సులభంగా ఛార్జ్ చేసేందుకు సరిపోతుంది. కాంపాక్ట్ డిజైన్‌లో వస్తుంది. డ్యూయల్ పోర్ట్‌లు రోజువారీ వినియోగానికి ఈజీగా ఉంటాయి. ప్రధానంగా ట్రావెలింగ్ ఇష్టపడే వారికి ఈ పవర్ బ్యాంకు అద్భుతంగా ఉంటుంది.
బోఆట్ క్రోమ్ హారిజన్ స్మార్ట్‌వాచ్ 1.51-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, VO2 మ్యాక్స్ ట్రాకింగ్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. కచ్చితమైన స్టెప్, ఆక్సిజన్ లెవల్ ట్రాకింగ్ వంటి ఫంక్షనల్ ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారుల ఆరోగ్యం, ప్రొడక్టవిటీని కూడా ప్రోత్సహిస్తుంది.
5. డిజిటెక్ 101 వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ : ధర రూ. 4,399
కంటెంట్ క్రియేటర్ల కోసం డిజిటెక్ (Digitek) 101 స్మార్ట్ నాయిస్ రెడెక్షన్‌తో 360 ఆడియో క్యాప్చర్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, DSLRలకు సపోర్టు అందిస్తుంది. ప్రొఫెషనల్-క్వాలిటీ వీడియోలను ఈజీగా క్రియేట్ చేయడంలో సాయపడుతుంది.
6. ఎన్‌యూ (Nu) రిపబ్లిక్ ట్రాన్స్ఫార్మ్ X ఇయర్ ఫోన్స్ : ధర రూ. 799
గేమర్స్, మ్యూజిక్ ప్రియుల కోసం ట్రాన్స్‌ఫార్మ్-ఎక్స్ 13mm డ్రైవర్లు, లో-లేటెన్సీ గేమింగ్ మోడ్, 60 గంటల ప్లేటైమ్, ENC మైక్‌లతో పవర్‌ఫుల్ బాస్‌ను అందిస్తుంది.