Apple CEO Tim Cook : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో దీపావళి ఫొటో.. ఆపిల్ సీఈఓ ఫుల్ ఫిదా.. అద్భుతమంటూ పోస్టు..!
Apple CEO Tim Cook : భారతీయ పండుగలపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మరోసారి స్పందించారు. ఈసారి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో తీసిన దీపావళి ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Apple CEO Tim Cook
Apple CEO Tim Cook : ఆపిల్ ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరు. ధరలోనే కాదు.. ఫీచర్లలో కూడా అంతే వాల్యూ ఉంటుంది. కెమెరా ఫీచర్లలో కూడా క్వాలిటీ కేక ఉంటుంది. అందుకే చాలామంది ఐఫోన్ ప్రియులు మార్కెట్లోకి కొత్త ఐఫోన్ వచ్చిందంటే ఎగబడి మరి కొనేస్తుంటారు. ధర ఎంత ఖరీదైనప్పటికీ కొనేందుకు వెనకాడరు అంతే.. ఇటీవల రిలీజ్ అయిన లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫొటో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అదే విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ దీపావళి పండగ సందర్భంగా తెలియజేశారు.
ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకునే (Apple CEO Tim Cook) వారిందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫోటోను ముంబైకి చెందిన ఫోటోగ్రాఫర్ అపేక్ష మకర్ కొత్త ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో క్లిక్ చేశారు. ఈ ఫొటోను టిమ్ కుక్ షేర్ చేస్తూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకునే ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పండుగ కావాలి’’ అని ఆకాంక్షించారు.
కొత్త ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో తీసిన దీపాల ‘అద్భుతమైన’ ఫొటోను షేర్ చేసినందుకు ముంబైకి చెందిన ఫోటోగ్రాఫర్ అపేక్ష మేకర్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో తీసిన ఈ అద్భుతమైన ఫొటోను షేర్ చేసినందుకు ఫొటోగ్రాఫర్ అపెక్సా మేకర్‌కు ధన్యవాదాలు’’ అని కుక్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఈ ఫొటో భారతీయ సాంప్రదాయ దియాల కాంతితో అద్భుతంగా మెరుస్తోంది. పండుగ వాతావరణాన్ని ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ పవర్‌ఫుల్ కెమెరా రెండింటినీ హైలైట్ చేస్తుంది. భారతీయ పండుగ వేడుకల సందర్భంగా ఆపిల్ సీఈఓ శుభాకాంక్షలు తెలపడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన లేటెస్ట్ ఐఫోన్‌లలో తీసిన ఫొటోలతో దీపావళి శుభాకాంక్షలను షేర్ చేశారు.
Wishing a joyful and healthy Diwali to all celebrating around the world! Thanks to Apeksha Maker for sharing this stunning photo taken on iPhone 17 Pro Max. pic.twitter.com/s4BarZip3m
— Tim Cook (@tim_cook) October 20, 2025
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర, స్పెసిఫికేషన్లు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ.1,49,900 వద్ద లభిస్తుంది. ఇతర స్టోరేజ్ ఆప్షన్లలో 512GB రూ.1,69,900, 1TB రూ.1,89,900, 2TB రూ.2,29,900 వద్ద ఉన్నాయి. ఈ ఐఫోన్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి అధీకృత రిటైలర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ లేటెస్ట్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. బెజెల్స్ గత మోడళ్ల కన్నా సన్నగా ఉంటాయి. డైనమిక్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్‌లో ఉంటుంది. ఆపిల్ కొత్త సిరామిక్ షీల్డ్ ప్లస్‌తో అప్‌గ్రేడ్ అయింది. మెరుగైన డ్రాప్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 8x ఆప్టికల్ జూమ్‌తో 48MP ప్రో ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం సెంటర్ స్టేజ్‌తో 18MP కెమెరా అందిస్తుంది. వీడియో సామర్థ్యాలలో 60fps వద్ద 4K, ప్రోరెస్ రికార్డింగ్ మెరుగైన స్టేబిలిటీ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 18MPగానే ఉంది. కానీ, ఇప్పుడు మెరుగైన పోర్ట్రెయిట్ మోడ్ లో లైటింగ్ సెల్ఫీలకు సపోర్టు ఇస్తుంది.