మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే యాపిల్ మీకు రూ.1,831 బాకీ!
పాత వెర్షన్ ఫోన్‌లను స్లో చేస్తామని బహిరంగంగా ఒప్పుకున్న యాపిల్.. రెండేళ్ల తర్వాత, 500మిలియన్ డాలర్లను క్లాస్‌సూట్ నుంచి తప్పించుకునేందుకు కస్టమర్లకు ఇవ్వడానికి ఒప్పుకుంది. అంటే రూ

పాత వెర్షన్ ఫోన్‌లను స్లో చేస్తామని బహిరంగంగా ఒప్పుకున్న యాపిల్.. రెండేళ్ల తర్వాత, 500మిలియన్ డాలర్లను క్లాస్‌సూట్ నుంచి తప్పించుకునేందుకు కస్టమర్లకు ఇవ్వడానికి ఒప్పుకుంది. అంటే రూ.3,662కోట్లు. కొత్త మోడల్ రాగానే పాత ఫోన్లలను కావాలను స్లోచేస్తుందన్నది వినియోగదారుల కంప్లయింట్. ఈ సంగతి ఐపోన్ యూజర్లందికీ తెలుసు. 2017, డిసెంబర్ 21కి ముందున్న కొన్న iPhone 6,6Plus,6S,6S Plus,7,7Plus,SE మోడల్స్ ఫోన్ ఒక్కోదానికి తక్కువులో తక్కువ 25 డాలర్లు అంటే రూ. 1,831 యాపిల్ ఇవ్వాల్సి ఉంది.
కొత్త మోడల్ ఫోన్ వచ్చినప్పుడల్లా పాత ఫోన్ ల అప్‌డేట్ సపోర్ట్ అంతగా లేకపోవడంపై ఐపోన్ యూజర్స్ లో చాలా అసంతృప్తి. 2016లోనే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ యూజర్లు కంప్లెయిన్ చేశారు. బ్యాటరీ పవర్ ఉన్నా, ఫోన్‌లు ఆకస్మాత్తుగా షట్‌డన్ అయిపోతున్నాయి. యాపిల్ సంస్థ కావాలనే తమ ఫోన్‌లను స్లోచేస్తోందని, అందువల్ల కొత్త మోడల్స్ సేల్స్ పెంచడానికి వేసిన చీప్ టెక్నిక్ గా యూజర్లు తిట్టిపోశారు. యేడాది తర్వాతగాని యాపిల్ తన తప్పును ఒప్పుకోలేదు. బ్యాటరీ పవర్ పెంచడానికి చేసిన సాఫ్ట్‌వేర్ అపడేట్ వల్ల ఫోన్లుస్లో అవుతున్నాయని చెప్పింది. యూజర్లు మాత్రం కన్విన్స్ కాలేదు. కొత్తఫోన్‌లను కొనిపించేందుకే యాపిల్ ఈ పనిచేసిందని నమ్మారు. వాదించారు. వీళ్లను శాంతింపచేయడం కోసం ఎఫెక్టెడ్ ఫోన్స్‌లో కొత్త బ్యాటరీ రేటును 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు తగ్గించింది.
ఇండియన్స్ సంగతేంటి? ఐఫోన్‌లను ఒక్క అమెరికావాళ్లేకాదు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. కాకపోతే యాపిల్ పరిహారం ఆర్డర్‌ను ఎప్రిల్ మూడున కోర్టు అప్రూవ్ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా అమెరికా యూజర్లకు, లాయర్లకు యాపిల్ 93 మిలియన్ డాలర్లను చెల్లిస్తుంది. ఫ్రెంచ్ రెగ్యులేటర్లు కూడా ఇదే కారణంమీద 25 మిలియన్ డాలర్లు అంటే 202 కోట్లు పరిహారం చెల్లించమని యాపిల్ ను ఆదేశించారు. మొత్తం ఐపోన్ వాడకందార్లలో ఇండియన్న్ కోటి 20లక్షల మంది. ఈలెక్కన భారతదేశ వినియోగదారులుకూడా class action వేస్తారా? ఆపనేకనుక చేస్తే, యూపిల్ మన వాళ్లకూ పరిహారం చెల్లించాల్సిందే. దాదాపు రెండువేలంటే మాటలు కాదు కదా?