Driverless Car : చందమామను సిగ్నల్ గా భావించి ఆగిపోయిన డ్రైవర్ లెస్ కారు!
టెస్లా డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీలో డొల్లతనం బయటపడింది. అవి అనేక రకాల తప్పిదాలు చేస్తున్నాయని వినియోగదారులు గుర్తించారు. చంద్రుడిని కూడా సిగ్నల్ లైట్ లా భావించి ఆగిపోతుందని.. ఈ టెక్నాలజీ వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన ఘటన టెస్లా ఆటో మ్యాటిక్ సిస్టమ్ పైనే అనేక అనుమానాలకు తెరలేపుతుంది.

Driverless Car
Driverless Car : అమెరికా ఖండంలో మంచి పేరున్న కార్ల కంపెనీ టెస్లా.. అక్కడ ఉన్న దిగ్గజ కార్ల కంపెనీల్లో ఇది ఒకటి. ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ దీని అధినేత. సిలికాన్ వ్యాలీని బేస్ చేసుకొని నడుస్తున్న టెస్లా కంపెనీ ప్రపంచంలోని అనేక దేశాల్లో తమ కంపెనీ కార్లను ఎగుమతి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కంపెనీ డ్రైవర్ లెస్ కార్లపై ఫోకస్ చేసింది. ఇందుకోసం ఓ టెక్నాలజీని రూపొందించింది. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని టెస్లా డ్రైవర్ లెస్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావించింది. కానీ తాజాగా జరిగిన కొన్ని పరిణామాలతో టెస్లా డ్రైవర్ లెస్ కార్లను తీసుకు రావడం అంత సులువు కాదని సీఈఓ ఎలెన్ మస్క్ తేల్చేశారు. ఈ తరుణంలోనే టెస్లా దీనిపై నీలి నీడలు అలుముకున్నాయి.
దీనికి కారణంతో కారులో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలే.. ఈ డ్రైవర్ లెస్ కార్ మనిషిలా అన్ని గుర్తించలేక పోతుంది, కొన్ని సందర్భాల్లో పొరబడుతుంది. పార్కింగ్ చేసే సమయంలో గజిబిజి అవుతుంది. అయితే తాజాగా ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అయింది ఈ టెక్నాలజీ.. ఈ కారు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎల్లో కలర్ లో చంద్రుడు కనిపించాడు. దీంతో అది ఒక్కసారిగా స్లో అయింది. లోపల ఉన్న వ్యక్తికి కారు ఎందుకు ఆగిందో అర్ధం కాలేదు. అయితే అది చంద్రుడిని ఎల్లో సిగ్నల్ గా గుర్తించినట్లు దాని యజమాని కనుగొన్నాడు. దీనినే వీడియో తెలిసి టెస్లా సీఈఓకి ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు. ఇదేం సాధారణమైన సమస్య కాదని, కచ్చితంగా ఇదో సంక్లిష్టమైన సమస్యేనని పేర్కొన్నాడతను.
తన టెస్లా కంపెనీ కారులో ఈ ఆటోపైలెట్ సిస్టమ్ డివైజ్‌ను ఉంచాడతను. చంద్రుడి రంగును చూసి ఎల్లో ట్రాఫిక్ లైట్‌గా చూపిస్తూ.. నిదానించింది కారు. దీంతో అతను ఫిర్యాదు చేశాడు. సుమారు పది వేల డాలర్లు విలువ చేసే ఈ టెక్నాలజీని వంద నుంచి రెండొదల డాలర్ల ఈఎంఐపై కూడా అదిస్తోంది టెస్లా. అయితే మొదటి నుంచి ఈ ఆటోపైలెట్ సిస్టమ్ సమస్యలకు కారణమవుతూ వస్తోంది. సరిగా నిర్దారణ చేసుకోలేకపోతుంది. కొన్ని సందర్భాల్లో లెర్నర్ కంటే దారుణంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు వినియోగదారులు.
Hey @elonmusk you might want to have your team look into the moon tricking the autopilot system. The car thinks the moon is a yellow traffic light and wanted to keep slowing down. ?? @Teslarati @teslaownersSV @TeslaJoy pic.twitter.com/6iPEsLAudD
— Jordan Nelson (@JordanTeslaTech) July 23, 2021