Dussehra Dhamaka Deals : అమెజాన్‌లో దసరా ధమాకా సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!
Dussehra Dhamaka Deals : అమెజాన్‌లో దసరా ధమాకా సేల్ మొదలైంది.. ఈ పండుగ సీజన్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. మరెన్నో బ్యాంకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Dussehra Dhamaka Deals on Amazon Sale
Dussehra Dhamaka Deals : పండుగ సీజన్ వచ్చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian Festival Sale) దసరా ధమాకా డీల్స్ (Dussehra Dhamaka Deals) సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది.
ప్రధానంగా రియల్‌మి నార్జో 60ప్రో ఫోన్ (Realme Narzo 60 Pro 5G) వంటి బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి మోటోరోలా రేజర్ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra) వంటి ప్రీమియం హ్యాండ్‌సెట్‌ల వరకు, ఆసక్తిగల కొనుగోలుదారులు మునుపెన్నడూ చూడని విధంగా తగ్గింపు ధరలకు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ అమెజాన్ సేల్.. వెబ్‌సైట్ సేల్ ఎండ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.
రూ.10వేల కొనుగోళ్లపై మరెన్నో బ్యాంకు డిస్కౌంట్లు :
అమెజాన్ డీల్‌లు, ఆఫర్‌లతో పాటు, అమెజాన్ అనేక బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. EMI ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.10వేల కొనుగోళ్లపై ఇన్‌స్టంట్ 10 శాతం తగ్గింపును పొందవచ్చు. క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

Dussehra Dhamaka Deals on Amazon Sale
అదే సమయంలో, ICICI క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్ (Amazon Prime Members)లకు రూ. 1,500 విలువైన రివార్డ్‌లను పొందే అవకాశం కూడా ఉంది. (Amazon Pay UPI) యూజర్లు రూ. 100 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఇ-కామర్స్ వెబ్‌సైట్ కూడా యూజర్లకు కొత్త కొనుగోలుకు బదులుగా పాత డివైజ్ విక్రయించడంపై రూ. 50వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.

Dussehra Dhamaka Deals
ఈ 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 వివిధ ధరల పరిధిలో 5G, 4G స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. Redmi, Realme, iQoo, Honor, Motorala, అనేక ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు భారీ తగ్గింపులతో హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేయొచ్చు. iQOO Z7s 5Gని కేవలం రూ.15,499తో కొనుగోలు చేయవచ్చు. EMI ఆప్షన్లలో నెలకు రూ. 5,166 చొప్పున Redmi 12C, Realme Narzo N53 ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లను అతి తక్కువ ధరలకు పొందవచ్చు.