Elon Musk : వికీపీడియా కాస్కో.. మస్క్ మామ గ్రోకిపీడియా వచ్చేసింది.. ఆరంభమే సంచలనం.. ఇదేలా పనిచేస్తుందంటే?
Elon Musk : మస్క్ మామ వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియాను దించేశాడు. ఈ గ్రోకిపీడియాతో ఇంటర్నెట్ సెర్చ్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి?
Elon Musk Grokipedia
Elon Musk : వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియా వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ అధినేత టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ మరో ప్రాజెక్ట్ గ్రోకిపీడియాను అధికారికంగా లాంచ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏఐ ఆధారిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా లైవ్ అయింది.
అయితే, ఈ ఏఐ గ్రోకిమీడియా వెబ్‌సైట్ (Elon Musk) మొదటి కొన్ని గంటల్లోనే క్రాష్ అయింది. మీరు ఇప్పటికీ ఈ సరికొత్త గ్రోకిపీడియాను యాక్సస్ చేయొచ్చు. ప్రారంభం నుంచే అత్యంత వేగంగా పాపులర్ అవుతోంది. ఇంతకీ గ్రోకిపీడియా అంటే ఏంటి? వికీపీడియాకు దీనికి మధ్య తేడా ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలన్ మస్క్ గ్రోకిపీడియా ఏంటి? :
మస్క్ గ్రోకిపీడియాను వికీపీడియాకు ‘మంచి ప్రత్యామ్నాయం’గా అభివర్ణించాడు. కానీ, ఈ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ, జెమిని లేదా మస్క్ సొంత గ్రోక్ చాట్‌బాట్ కన్నా భిన్నంగా పనిచేస్తుంది. సాధారణ కాన్వర్‌జేషన్ చాట్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా సెర్చ్ ఇంజిన్ మాదిరిగా పనిచేస్తుంది. వినియోగదారులు ఒక అంశం పేరును టైప్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు.. “పారిస్” ఆ స్థలం గురించి ప్రతిదీ రివీల్ చేస్తుంది.
గ్రోకిపీడియా ఎలా ఉపయోగించాలి? :
వినియోగదారులు (Grokipedia.com)ని నేరుగా విజిట్ చేయడం ద్వారా ఏదైనా అంశంపై సమాచారం కోసం సెర్చ్ చేయొచ్చు. అయితే, రిపోర్టుల ప్రకారం.. అనేక స్టోరీల కింద ఒక నోట్ కనిపిస్తుంది. ‘కంటెంట్ వికీపీడియా నుంచి తీసుకోవడం జరిగింది. క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్అలైక్ 4.0 లైసెన్స్ కింద లైసెన్స్ పొందింది.’ దీని అర్థం.. గ్రోకిపీడియాలో కనిపించే కంటెంట్ చాలావరకూ ఇప్పటికీ వికీపీడియా నుంచి సేకరించినట్టు తెలిసింది.
https://t.co/op5s4ZiSwh version 0.1 is now live.
Version 1.0 will be 10X better, but even at 0.1 it’s better than Wikipedia imo.
— Elon Musk (@elonmusk) October 28, 2025
సోషల్ మీడియా పోస్ట్‌లో మస్క్ ప్రకారం.. “Grokipedia.com వెర్షన్ 0.1 ఇప్పుడు అందుబాటులో ఉంది. వెర్షన్ 1.0 10 రెట్లు మెరుగ్గా ఉంటుంది. కానీ, 0.1 వద్ద కూడా వికీపీడియా ఇమో కన్నా మెరుగ్గా ఉంటుంది”. గ్రోకిపీడియా ప్రారంభించిన తర్వాత మిలియన్ల కొద్దీ ఎంట్రీలతో నిండిపోవడంతో గ్రోకిపీడియా వెబ్‌సైట్ క్లుప్తంగా క్రాష్ అయింది. వికీపీడియాలో దాదాపు 7 మిలియన్ల హ్యుమన్ రైట్ ఎంట్రీలతో పోలిస్తే దాదాపు 8లక్షల ఏఐ ఆధారిత ఎంట్రీలు లాంచ్ సమయంలో కనిపించాయి.
ఈ గ్రోకిపీడియా (Grokipedia.com) యాక్సెస్ చేసినప్పుడు సెర్చ్ బార్ కూడా డార్క్ టోన్ కాకుండా డార్క్ బ్యాక్ గ్రౌండ్ కనిపించింది. ఫాంట్ స్టైల్ చాట్‌జీపీటీని పోలి ఉంటుంది. వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో మొదటి రోజు 885,279 స్టోరీలను వీక్షించారు. ఇంగ్లీష్ వికీపీడియాలో 7,081,705 స్టోరీలను వీక్షించారు.
యూజర్ల అభిప్రాయాలు.. ఊహాగానాలివే :
ఎలన్ మస్క్ పోస్ట్‌పై వ్యాఖ్యానించిన చాలా మంది వినియోగదారులు ఎన్‌సైక్లోపీడియా తప్పు సమాధానాలు ఇస్తోందని పేర్కొంటూ సమస్యలను ఎత్తి చూపారు. కొంతమంది వినియోగదారులు గ్రోకిపీడియా ప్రధానంగా ఎలన్ మస్క్‌ను కీర్తిస్తోంది. సానుకూల సమాచారాన్ని మాత్రమే చూపిస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ, మస్క్ ఆధిపత్యంతో గ్రోకిపీడియా ఇంటర్నెట్ సెర్చ్ నిర్వహించే విధానాన్ని పూర్తిగా మారుస్తుందని అనేక ఊహాగానాలు సూచిస్తున్నాయి. ఏఐ ముందుగా ఉన్న సమాచారంపై పనిచేస్తుంది. కచ్చితమైన సమాచారానికి హామీ ఇవ్వలేం.
సమాచారం ఎక్కడిందంటే? :
గ్రోకిపీడియా ఇంటర్నల్ డేటా చాలా వరకు వికీపీడియా ప్రస్తుతం ప్రధాన సోర్సుగా ఉంది. గ్రోకిపీడియాలో సెర్చ్ చేసే కంటెంట్ సోర్స్ ప్రస్తుతం డేటా వికీపీడియా నుంచి సేకరిస్తుందని సూచిస్తుంది. గ్రోకిపీడియా వికీపీడియాతో పోటీ పడగలదా? :
వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి లారెన్ డికిన్సన్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోకిపీడియాకు వికీపీడియా ఉనికి తప్పనిసరిగా తెలుస్తుంది. వికీపీడియా లాభాపేక్షలేని యాడ్ ఫ్రీ విధానాలతో గత రెండు దశాబ్దాలుగా విశ్వసనీయంగా నిలిచింది. భవిష్యత్తులో గ్రోకిపీడియా నిజంగా వికీపీడియాతో పోటీ పడగలదా లేదా అది కేవలం ఏఐ-ఆధారిత వెర్షన్‌గా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
గ్రోకిపీడియా వికీపీడియాతో పోటీ పడగలదా? :
వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి లారెన్ డికిన్సన్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోకిపీడియాకు వికీపీడియా ఉనికి తప్పనిసరిగా తెలుస్తుంది. వికీపీడియా లాభాపేక్షలేని యాడ్ ఫ్రీ విధానాలతో గత రెండు దశాబ్దాలుగా విశ్వసనీయంగా నిలిచింది. భవిష్యత్తులో గ్రోకిపీడియా నిజంగా వికీపీడియాతో పోటీ పడగలదా లేదా అది కేవలం ఏఐ-ఆధారిత వెర్షన్‌గా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
