Elon Musk Offer : ట్విట్టర్‌ను కొనేస్తాను.. ఎలాన్ మస్క్ బంపరాఫర్..!
Elon Musk Offer : బిలియనీర్, టెస్లా అధినేత, SpaceX CEO ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ కంపెనీని టేకోవర్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Elon Musk Tries To Buy Twitter For 41 Billion Dollars Tesla Ceo Offers 54.20 Dollars A Share
Elon Musk Offer : బిలియనీర్, టెస్లా అధినేత, SpaceX CEO ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ కంపెనీని టేకోవర్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 41.39 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనేస్తానంటూ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మస్క్ ప్రపోజల్ పెట్టాడు. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ ఏప్రిల్ 14న ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్విట్టర్ కంపెనీలో అతిపెద్ద వాటాదారుడిగా ఉన్న మస్క్.. మిగిలిన షేర్లు కూడా తానే కొనేసి ట్విట్టర్ కంపెనీని కొనేసేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ట్విట్టర్లో తన షేర్లు మినహా మిగతా షేర్లలో ఒక్కో షేరుకు 54.20 డాలర్లు పెట్టి కొనేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు మస్క్.
అంటే.. ప్రస్తుతం ట్విట్టర్ స్టాక్ ధర కన్నా 38 శాతం ఎక్కువ పెట్టి కొనేస్తానంటున్నాడు బిలయనీర్ మస్క్. జనవరి 28 నాటి షేరు ధరకు 54శాతం అధికంగా ఇస్తానని మస్క్ అంటున్నాడు. ఇప్పటికే ట్విట్టర్ కంపెనీలో 9శాతానికి పైగా వాటాలను కొనేశాడు. దాదాపుగా 73.5 మిలియన్ షేర్లను ట్విట్టర్లో మస్క్ కొనేశాడు. ఇప్పుడు 41.39 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.31,51,37,25,15,000) వరకు మూడు లక్షల కోట్లకు పైనే కొంటానంటూ మస్క్ ఆఫర్ ఇచ్చాడు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో మస్క్ వివరాలను తెలిపాడు.

Elon Musk Tries To Buy Twitter For 41 Billion Dollars Tesla Ceo Offers 54.20 Dollars A Share
ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్ ఇచ్చానని, కంపెనీ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దాన్ని అన్‌లాక్ చేస్తానంటూ ఎలాన్ మస్క్ చెబుతున్నాడు. ఈ ఆఫర్ వద్దంటే.. షేర్‌హోల్డర్‌గా తన రోల్ తిరిగి పరిశీలిస్తానని వెల్లడించారు. మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 6 శాతం మేర పెరిగాయి. గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్య్రంపై మస్క్ పోల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కొత్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు మస్క్ ప్రకటించారు కూడా.
I made an offer https://t.co/VvreuPMeLu
— Elon Musk (@elonmusk) April 14, 2022
కానీ, ఇప్పుడు ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఏకంగా మస్క్ ప్రతిపాదన చేశాడు. ఇప్పటికే మస్క్ వద్ద 73.5 మిలియన్ ట్విట్టర్ షేర్లు ఉన్నాయి. మస్క్ వాటా విలువ 2.9బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ షేర్లు అన్ని రివకబుల్ ట్రస్ట్ పేరుతోనే ఉన్నాయి. ట్విట్టర్లో ఎలాన్ మస్క్‌కు ఫాలోయింగ్ బాగానే ఉంది. 2009లో ట్విట్టర్ ప్లాట్ఫామ్లో చేరిన మస్క్.. ప్రస్తుతం 80 మిలియన్లకుపైనే.. అంటే 8 కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
Read Also : Elon Musk : ట్విట్టర్లో ఎడిట్ బటన్ పోల్.. ఎలన్ మస్క్‌పై ట్విట్టర్ సీఈవో కామెంట్..!