Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్, క్యాష్‌బ్యాక్.. వెంటనే కొనాలనుకునేవారు ఇలా చేయండి..
డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఎలా కొనాలో తెలుసుకుందాం.

Vivo T2 Pro: భారీ ఆఫర్ అందుబాటులోకి రాగానే స్మార్ట్‌ఫోన్ కొనాలని మీరు భావిస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో Vivo T2 Pro 5Gని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఎలా కొనాలో తెలుసుకుందాం.
Vivo ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999కి లిస్ట్ చేశారు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను 14 శాతం డిస్కౌంట్‌తో రూ. 23,999కే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా వాడుకోవచ్చు.
మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉండి, దానితో బిల్ కడితే 5 శాంత క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీనితో పాటు మీకు రూ.4000 డిస్కౌంట్ కూపన్ కూడా అందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేదు. కానీ, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,175 ఈఎంఐ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. దీనితో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. 1300 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌తో వచ్చింది.
కెమెరా, బ్యాటరీ
కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4600 mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.