జర్నలిస్టులకు ఫేస్‌బుక్ జాబ్‌లు

  • Published By: Mahesh ,Published On : August 21, 2019 / 03:52 AM IST
జర్నలిస్టులకు ఫేస్‌బుక్ జాబ్‌లు

Updated On : August 21, 2019 / 3:52 AM IST

ఫేస్‌బుక్‌లో న్యూస్ ఈ అంశంపై కొద్ది రోజుల ముందే సీఈవో మార్క్ జూకర్ బర్గ్ బయటపెట్టగా ఇప్పుడు మరో కొత్తరూపం దాల్చింది. ఫేస్‌బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. స్వంతగా తామే జర్నలిస్టులను రిక్రూట్ చేసుకుని జాబ్ ఇస్తామని ముందుకొచ్చింది. ‘న్యూస్ టాబ్‌ను పర్సనలైజ్ చేయాలనుకుంటున్నాం. కేటగిరీ ప్రకారం న్యూస్‌ను డివైడ్ చేసి వినియోగదారులకు మంచి సేవను అందించాలనుకుంటున్నాం’ అని ఫేస్‌బుక్ మేనేజ్మెంట్ తెలిపింది.

ప్రస్తుతం న్యూస్ ఫీడ్ అని ప్రత్యేక విభాగంలో స్నేహితుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇదే తరహాలో ఫేస్‌బుక్ డిమాండబుల్ న్యూస్ పబ్లిష్ చేసేందుకు సిద్ధమైంది. తొలి రోజుల్లోలా కాకుండా న్యూస్ ఇవ్వడానికి మంచి టీం రెడీగా ఉంది. ఈ సర్వీస్‌తో మరిన్ని సేవలు అందించనున్నామని ఓ పత్రికలో ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ సంవత్సరారంభంలో జరిగిన సమావేశంలో క్వాలిటీ న్యూస్ అందించేందుకు ఎంత చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని జూకర్‌బర్గ్ తెలిపారు.

ఎన్నో యేళ్లుగా ఆన్ లైన్ ప్రకటనల గుత్తాధిపత్యంపై పోరాడుతున్న వార్తా పరిశ్రమను దెబ్బ తీస్తుందనే విమర్శలు వస్తున్న తరుణంలో ఫేస్‌బుక్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. News Tabను లాంచ్ చేసే పనిలో ఉన్నట్టు ధృవీకరించింది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్.. న్యూస్ సెక్షన్ సర్వీసుకు సంబంధించి ఏప్రిల్ నుంచే చర్చలు ప్రారంభించారు. వాల్ స్ట్రీట్ జనరల్ స్టోరీస్‌కు లైసెన్స్ చెల్లించడం గురించి ఫేస్ బుక్.. న్యూస్ కార్పొరేషన్‌ను సంప్రదించినట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తి ధ్రువీకరించారు.