Facebook Launches Creator Education
Facebook creator education : కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకునేవారికి మంచి అవకాశం. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అతిపెద్ద క్రియేటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనేబుల్ మెంట్ ప్రొగ్రామ్ తీసుకొచ్చింది. Creater Day India Event సందర్భంగా ఫేస్ బుక్ ఈ కొత్త ఆన్ లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆన్ లైన్ కోర్సు ఫేస్ బుక్ ప్లాట్ ఫాంతో పాటు ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ప్రవేశపెట్టిన Born On Instagram Program తర్వాత దశగా పేర్కొంది. ఈ ప్రొగ్రామ్ 2019లోనే లాంచ్ అయింది.
Read More : Air India : ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్
కానీ, ఇప్పుడు భారతీయ కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ-లెర్నింగ్ కోర్సు నేర్చుకోవడం ద్వారా కంటెంట్ క్రియేటర్లు స్వయం ఉపాధిని పొందవచ్చు. కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. ఈ కోర్సులో ప్రధానంగా మార్కెట్ ధోరణి, ప్రొడక్టుల అప్ డేట్స్, సవాళ్ల గురించి నిపుణులతో టీచింగ్ అందిస్తారు. తమ కంటెంట్ తో.. మనీ క్రియేషన్ ఎలా చేయాలన్న టెక్నిక్స్ చెబుతారు. కంటెంట్ క్రియేటర్లు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు అధిక ఆదాయం, వృద్ధి అవకాశాలు పొందడానికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని ఇన్‌స్ట్రాగామ్ హెడ్ అడమ్ మోసెరీ తెలిపారు.
చిన్న పట్టణాల్లోనూ ఇన్‌స్ట్రాగామ్ షార్ట్ వీడియో ఫీచర్ రీల్స్ వినియోగం బాగా పెరిగిందని తెలిపారు. ప్రతిరోజూ సగటున 60 లక్షల రీల్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పారు. కొంతమంది క్రియేటర్లు ఇప్పటికే తమ అనుభవాలను ఈవెంట్ సందర్భంగా తెలియజేశారు. in-Stream Ads ద్వారా తామెంతో సంపాదిస్తున్నామో వివరించారు. ఒక నిమిషం నిడివి గల షార్ట్ వీడియోలతో మానిటైజ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్టు చెప్పారు. కుకింగ్ క్లాసులు, వర్చువల్ టూర్స్ సహా ఇతర అనేక ఈవెంట్ల నుంచి డబ్బులు సంపాదించేందుకు కంటెంట్ క్రియేటర్ల కోసం పెయిడ్ ఆన్ లైన్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్.
Read More : Whatsapp: వాట్సాప్‌లో ‘రూపాయి’ సింబల్ ఫీచర్ చూశారా?