Whatsapp: వాట్సాప్‌లో ‘రూపాయి’ సింబల్ ఫీచర్ చూశారా?
వాట్సాప్ యూజర్లు ఇది గమనించారా? మీ చాట్ కంపోజర్ లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. వాట్సాప్ ప్లాట్ ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికి అందుబాటులో లేదు.

Whatsapp Payment Adds India’s Rupee Symbol In Chat Composer
WhatsApp payment rupee symbol : వాట్సాప్ యూజర్లు ఇది గమనించారా? మీ వాట్సాప్ చాట్ కంపోజర్ లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. అదేనండీ.. మన భారతీయ రూపాయి సింబల్.. భారత మార్కెట్లో వాట్సాప్ ప్లాట్ ద్వారా ఈజీగా వినియోగదారులు పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్ యాడ్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికి అందుబాటులో లేదు.. రానున్న వారాల్లో భారతీయ రెగ్యులర్ వాట్సాప్ యూజర్ల అందరికి ఈ Rupee Symbol ఫీచర్ అందుబాటులోకి రానుంది. Whatsapp Chat Composerలో పేమెంట్లు చేసుకునే యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఫీచర్ ప్రవేశపెట్టినట్టు ఫేస్ బుక్ సొంత యాప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Mumbai : కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీసు, కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్
80శాతానికి పైగా పేమెంట్లు ఇప్పటికీ నగదు రూపంలోనే కొనసాగుతున్నాయి. దేశంలో మూడోవంతు గ్రామీణ ప్రాంతాల్లోనే నగదు ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ పేమెంట్లు చేసేలా ప్రోత్సహించేందుకు వాట్సాప్ ముందుకు వచ్చింది. అందరూ సులభంగా How To Pay అనేది తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. గ్రామాలు, పట్టణాలతో పాటు అన్నిచోట్ల వాట్సాప్ పేమెంట్స్ యాక్సస్ చేసుకునేలా అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని వాట్సాప్ ఇండియా పేమెంట్స్ డైరెక్టర్ మనేశ్ మహత్మే తెలిపారు.
చాట్ కంపోజర్ పేమెంట్ల కోసం మరో ఫీచర్ కూడా అయింది. Camera Icon.. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఏదైనా QR code ద్వారా స్కాన్ చేసుకోవచ్చు. భారతదేశంలోని 20 మిలియన్లకు (2కోట్లు) పైగా స్టోర్లలో ఈ QR Codes స్కాన్ చేసుకోవచ్చు. భారతీయ యూజర్ల కోసం వాట్సాప్ మరో పేమెంట్ ఫీచర్ కూడా తీసుకురానుంది. అదే.. Cashback.. ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. Whatsapp Payments ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరిపిన 48 గంటల తర్వాత క్యాష్ బ్యాక్ పొందవచ్చుననని WABetaInfo పేర్కొంది. అయితే ఈ Cashback ఫీచర్ అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుందా లేదో క్లారిటీ ఇవ్వలేదు.
Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం