Air India : ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్

ఎయిర్ ఇండియాను టాటా సన్స్ సంస్థ దక్కించుకుంది. 

Air India : ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్

Tata Sons Air India

Air India : ఎయిర్ ఇండియా బిడ్ ను టాటా సన్స్ సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ విమాన యాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా టాటా టాటా వశమైనట్టు సమాచారం అందుతోంది. రూ.43వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం ఇటీవల బిడ్లు ఆహ్వానించింది. 100శాతం పెట్టుబడులను కేంద్రం ఇప్పటికే ఉపసంహరించుకుంది. కేంద్రం నిర్ణయంతో.. ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు టాటా, స్పైస్ జెట్ బిడ్లు వేశాయి. చివరకు బిడ్ ను టాటా సన్స్ గెల్చుకుంది. 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా టాటాల వశమైంది.

1932లో టాటా గ్రూప్.. టాటా ఎయిర్ లైన్స్ ను స్థాపించింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి టాటా సంస్థ… విస్తారా ఎయిర్ లైన్స్ ను నడుపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల కౌన్సిల్ …. టాటా సన్స్, స్పైస్ జెడ్ బిడ్లను పరిశీలించింది. ఎంత విలువలకు టెండర్ బిడ్ ను టాటా సంస్థ దక్కించుకుందనేది తెలియాల్సి ఉంది.

Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం

నష్టాలనుంచి బయటపడలేకపోవడంతో…  2018లో 76శాతం షేర్ అమ్మాలని ఎయిర్ ఇండియా భావించింది. ఐతే.. ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో.. పూర్తిగా పెట్టుబడులు ఉపసంహరించుకుని 2 వేర్వేరు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ను పూర్తిగా ఎయిర్ పోర్టు సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ లో 50శాతం షేర్ అమ్మకానికి పెట్టింది. ఎయిర్ ఇండియాకు ఉన్న ఆస్తులను కూడా ఆయా సంస్థలకు అప్పగించనుంది.  తాజా బిడ్డింగ్ తో.. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. టాటా వశమైనట్టయింది.

ముంబైలోని ఎయిర్ ఇండియా బిల్డింగ్, ఢిల్లీలోని ఎయిర్ లైన్స్ హౌజ్ కూడా ఒప్పందం ప్రకారం బిడ్ దక్కించుకున్న కంపెనీకి దక్కుతాయి.

Nicolas Sarkozy : ఫ్రాన్స్ మాజీ అధక్షుడికి ఏడాది జైలు శిక్ష