ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. అదే. డార్క్ మోడ్ ఫీచర్.

  • Published By: sreehari ,Published On : March 4, 2019 / 09:57 AM IST
ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో మరో కొత్త ఫీచర్

Updated On : March 4, 2019 / 9:57 AM IST

ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. అదే. డార్క్ మోడ్ ఫీచర్.

ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. అదే. డార్క్ మోడ్ ఫీచర్. మెసేంజర్ యాప్ లో డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన ఫేస్ బుక్.. ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఫేస్ బుక్ మెసేంజర్ చాట్ బాక్స్ లో డార్క్ మోడ్ ఆప్షన్ కనిపించనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ డార్క్ మోడ్ ఫీచర్ ను ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో ఎలా యాక్టివేట్ (ఎనేబుల్) చేయాలో తెలుసుకుందాం.
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్

ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో డార్క్ మోడ్ ఫీచర్ ను యాక్టివేట్ చేయాలంటే.. మూన్ ఎమోజీ సాయంతో సులభంగా ఎనేబుల్ చేయొచ్చు. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. క్రిస్కెంట్ మూన్ ఎమోజీని మీ స్నేహితులకు చాట్ బాక్స్ ద్వారా పంపించాలి. ఎమోజీని పంపిన వెంటనే.. మీ చాట్ బాక్స్ విండోలో మూన్స్ ఎమోజీలు కనిపిస్తాయి. ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ సెట్టింగ్స్ లో డార్క్ మోడ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. 

యూజర్లు.. Messenger App లోని తమ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లాలి. ప్రొఫైల్ పేజీలో డార్క్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ  (టర్న్ ఆన్/ ఆఫ్) Turn on మార్క్ చేస్తే చాలు. డార్క్ మోడ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఓఎస్ ప్రతి యూజర్ ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో ఈ డార్క్ మోడ్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చునని ఓ నివేదిక తెలిపింది. 

ఫిబ్రవరిలోనే ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో ఒక ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అన్ సెండ్, రీకాల్ ఫీచర్లను అప్ డేట్ చేసింది. ఇలాంటి ఫీచర్లనే వాట్సాప్ కూడా 2018లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఏదైనా అన్ వాటెండ్ మెసేజ్ ను పొరపాటున సెండ్ చేస్తే.. వెంటనే డిలీట్ చేయొచ్చు. మీరు సెండ్ చేసిన అన్ వాటెండ్ మెసేజ్ ను ఇతరులు చదవక ముందే అంటే.. 10 నిమిషాల్లో డిలీట్ చేయాలి. లేదంటే.. ఆ తర్వాత ఏమి చేయలేరు. వాట్సాప్ లో కూడా ఇదే తరహా ఆప్షన్ ఉంది. వాట్సాప్ లో మాత్రం గంట పాటు సమయం ఉంది. 

ఫేస్ బుక్ మెసేంజర్ లో Unsend  Message డిలీట్ చేయండిలా..
* సెండ్ చేసిన అన్ వాంటెడ్ మెసేజ్ పై ట్యాప్ చేయండి
డిలీట్ చేయాలనుకునే మెసేజ్ సెలెక్ట్ చేయండి.
ఇక్కడ యూజర్లుకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
ఒకటి.. రీమూవ్ ఫర్ ఎవరీవన్.. రెండోది.. రీమూవ్ ఫర్ యూ
రీమూవ్ ఫర్ ఎవరీవన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే.. మెసేజ్ డిలీట్ అవుతుంది. 
* మెసేజ్ రీమూవ్ అయినట్టు చాట్ బాక్స్ లో కనిపిస్తుంది.