Fake ChatGPT Apps : ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్.. మీ ఫోన్ ఫుల్ కంట్రోల్ ఇక హ్యాకర్ల చేతుల్లో.. మీ నెంబర్లతో స్కామ్ చేస్తారు జాగ్రత్త..!
Fake ChatGPT Apps : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంకా (ChatGPT) అందుబాటులో లేదు. మీరు AI చాట్‌బాట్ అనే పేరుతో ఏదైనా యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపిస్తే వెంటనే బయటకు వచ్చేయండి.

Fake ChatGPT apps on Google Play Store can take control over Android phones
Fake ChatGPT Apps : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాట్‌జీపీటీ (ChatGPT) యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో మీరు ChatGPT అనే ఏదైనా యాప్‌ని గుర్తిస్తే.. ఆ యాప్‌లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించే డేంజరస్ మాల్వేర్ కావచ్చు. మీరు ఇలాంటి యాప్స్ ఉపయోగించడం మానేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాల్వేర్‌తో సమస్య పెరుగుతోందని ఇటీవలి నివేదిక తెలిపింది. మాల్వేర్ అనేది హానికరమైన సాఫ్ట్‌వేర్.. మీ ఫోన్ నుంచి హాని కలిగించవచ్చు లేదా సమాచారాన్ని దొంగిలించవచ్చు. మాల్వేర్ చాలా మంది వ్యక్తులు ఉపయోగించే చాట్‌జీపీటీ అనే పాపులర్ AI చాట్‌బాట్ మాదిరిగా కనిపిస్తోంది.
పాలో ఆల్టో నెట్‌వర్క్స్ (Palo Alto Networks Unit) యూనిట్ 42కి చెందిన పరిశోధకులు ఈ మాల్‌వేర్‌ను గుర్తించారు. ఓపెన్ ఏఐ (OpenAI) GPT-3.5, GPT-4లను లాంచ్ చేసిన సమయంలోనే కనిపించిందని గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్‌లు ప్రత్యేకంగా (ChatGPT) టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను ఫేక్ యాప్స్ లక్ష్యంగా చేసుకుంటాయి. రీసెర్చర్లు గుర్తించిన రెండు రకాల యాక్టివ్ మాల్వేర్లు ఉన్నాయి. అందులో ఒకదానిని మీటర్‌ప్రెటర్ ట్రోజన్ అని పిలుస్తారు. ‘SuperGPT’ అని పిలిచే యాప్‌గా కనిపిస్తుంది. ఇతర మాల్వేర్ రియల్ ChatGPT యాప్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఇది థాయిలాండ్‌లోని ఖరీదైన ఫోన్ నంబర్‌లకు సీక్రెట్‌గా మెసేజ్‌లను పంపుతుంది.
రీసెర్చర్లు, డేంజరస్ ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (APK) మోడల్‌ను కూడా గుర్తించారు. ఆండ్రాయిడ్ డివైజ్‌లో అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు ఉపయోగించే ఫైల్ టైప్.. ఈ డేంజరస్ APK అసలైన యాప్ ఎడిటెడ్ వెర్షన్‌గా మారింది. చట్టబద్ధమైన యాప్ అనేది ChatGPT లేటెస్ట్ వెర్షన్ ఆధారంగా AI అసిస్టెంట్. ఈ డేంజరస్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తే.. దాడి చేసే యూజర్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇంకా, రీసెర్చర్లు (APK) మాల్వేర్ మోడల్ మరొక గ్రూపును కనుగొన్నారు. ఈ మోడల్ సర్‌ఫేస్‌పై రియల్ యాప్ మాదిరిగానే కనిపిస్తాయి. ChatGPT డేటాతో కూడిన వెబ్‌పేజీని చూపిస్తుంది. నివేదిక ప్రకారం.. ఈ యాప్స్‌లో ఒక డేంజరస్ మాల్‌వేర్ హైడ్ అయి ఉందని చెప్పవచ్చు. ఈ మాల్వేర్ మోడల్స్ మరింత మోసపూరితంగా ఉంటాయి. అప్లికేషన్ ఐకాన్ ChatGPT వెనుక సంస్థ OpenAI లోగోను ఉపయోగిస్తాయి. ఈ యాప్‌లు చట్టబద్ధమైన ChatGPT AI టూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నట్టు తెలిపింది.
ఈ డేంజరస్ APK మోడల్స్ థాయిలాండ్‌లోని ఖరీదైన ప్రీమియం-రేట్ నంబర్‌లకు SMS మెసేజ్‌లను పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రీమియం-రేట్ నంబర్లతో సాధారణ ఫోన్ నంబర్‌ల కన్నా ఎక్కువ ఖరీదైనవి. సాధారణంగా యూజర్లు డేటా లేదా కొన్ని రకాల సర్వీసు కోసం పేమెంట్ సర్వీసుల కోసం ఉపయోగిస్తారు. అయితే, ఈ సందర్భంలో, మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఈ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేందుకు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి యాప్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ChatGPTకి సంబంధించిన యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.