iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?

iPhone 16 Series : ఐఫోన్ 16లో ఫ్లాష్ ప్రైమరీ కెమెరా ఐలాండ్ నుంచి బ్యాక్ ప్యానెల్‌కు కుడి వైపుకు మారింది. డిజైన్ కొద్దిగా సర్దుబాటు అయినట్టుగా కనిపిస్తుంది. డిజైన్‌లోని ఈ సూక్ష్మమైన మార్పు గత లీక్‌లతో దగ్గరగా ఉంది.

iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?

First official iPhone 16 image leaked on Reddit, phone spotted in two colour options ( Image Source : Google )

iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 16 తొలి అధికారిక ఫొటో లీక్ అయింది. ఆపిల్ ఔత్సాహికులకు ఐకానిక్ స్మార్ట్‌ఫోన్ నెక్ట్స్ ఏయే ఫీచర్లతో రానుందో ముందస్తుగానే వివరాలు బయటకు వచ్చాయి. లీకైన ఫొటో ప్రకారం.. డమ్మీ యూనిట్‌గా కనిపిస్తుంది. ఐఫోన్ 16 మోడల్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. ముఖ్యంగా కెమెరా విభాగంలో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ కొన్ని ఆసక్తికరమైన మార్పులను అందిస్తుంది.

Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!

కెమెరా సెటప్‌ను కలిగిన ఐఫోన్ 15 మాదిరిగా కాకుండా ఐఫోన్ 16 నిలువుగా డ్యూయల్ వెనుక కెమెరా సిస్టమ్‌తో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్, పిల్ ఆకారంలో ఐఫోన్ ఎక్స్ మోడల్ గుర్తుకు తెస్తుంది. కానీ ఇందులో ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌తో వస్తుంది. ప్రాదేశిక వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్ ప్రో మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ స్టాండర్డ్ మోడల్‌లకు కొన్ని హై-ఎండ్ సామర్థ్యాలను తీసుకువస్తుందని సూచిస్తుంది.

ఐఫోన్ 16లో ఫ్లాష్ ప్రైమరీ కెమెరా ఐలాండ్ నుంచి బ్యాక్ ప్యానెల్‌కు కుడి వైపుకు మారింది. డిజైన్ కొద్దిగా సర్దుబాటు అయినట్టుగా కనిపిస్తుంది. డిజైన్‌లోని ఈ సూక్ష్మమైన మార్పు గత లీక్‌లతో దగ్గరగా ఉంది. ఆపిల్ కొత్త ఫోన్లలో ఆకర్షణీయమైన డిజైన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉండనుంది. లీక్‌లో కనిపించే బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లకు మించి ఐఫోన్ 16 బ్లూ, గ్రీన్, పింక్ వంటి ఇతర షేడ్స్‌లో రావచ్చు. ఆపిల్ ఈ ఏడాదిలో మరిన్ని కలర్ ఆప్షన్లను అందించనుంది.

స్పెసిఫికేషన్‌లకు సంబంధించి, ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పవర్‌ఫుల్ రంగులు, లోతైన కాంట్రాస్ట్‌లను అందిస్తుంది. ఫోన్ యాక్షన్ బటన్‌ను కలిగి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ప్రత్యేకమైన ఫీచర్.

ఈ బటన్ యూజర్లకు వివిధ ఫంక్షన్లకు వేగంగా యాక్సస్ అందిస్తుంది. మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. హుడ్ కింద, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లు ఎ18 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. టీఎస్ఎమ్‌సీ అధునాతన 3ఎన్ఎమ్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ మరింత శక్తివంతమైన ఎ18 ప్రో చిప్‌లో రన్ అవుతాయని భావిస్తున్నారు.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?