Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డేట్ తెలిసిందోచ్.. టాప్ 6 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం వివిధ కేటగిరీ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లతో హోలీ సేల్ (Flipkart Holi Sale) నిర్వహిస్తోంది.

Flipkart Big Saving Days sale date revealed_ iPhone 14, Nothing Phone (1), more phones to get discounted
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రస్తుతం వివిధ కేటగిరీ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లతో హోలీ సేల్ (Flipkart Holi Sale) నిర్వహిస్తోంది. హోలీ సేల్ ముగియక ముందే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) పేరుతో మరో సేల్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మార్చి 11న ప్రారంభమై మార్చి 15 వరకు కొనసాగుతుంది. మార్చి 10న ప్లస్ సభ్యుల (Flipkart Plus Members) కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ఇప్పుడు, ప్లస్ సభ్యులుగా ఉన్న కస్టమర్లకు ఈ సేల్ ఎల్లప్పుడూ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) మెంబర్‌షిప్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్ లాగానే పనిచేస్తుంది. ఉచిత డెలివరీ, డిస్కౌంట్‌లకు ముందస్తు యాక్సెస్, అనేక ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రస్తుతానికి, ఈ-కామర్స్ దిగ్గజం సేల్ కోసం బ్యాంక్ ఆఫర్‌లను వెల్లడించలేదు.
ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని డిస్కౌంట్ ఆఫర్‌లను ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ పోస్ట్ ప్రకారం.. ఆపిల్ iPhone 14 సిరీస్, Google Pixel Phones, Samsung, Poco, Realme మొదలైన వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో లభించే కొన్ని బెస్ట్ డీల్‌లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Flipkart Big Saving Days sale date revealed
iPhone 14, iPhone 14 Plus :
ఐఫోన్ 14 సిరీస్ అదిరే డిస్కౌంట్‌తో రానుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14 Sale), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) భారీ తగ్గింపుతో లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. కచ్చితమైన తగ్గింపు ఆఫర్‌లు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫోన్‌లు రూ. 70వేల లోపు లభిస్తాయని అంచనా. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
Samsung Galaxy S21 FE :
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. శాంసంగ్ (Galaxy S21 FE) సేల్ సమయంలో రూ. 12,990 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే, డీల్‌కు కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ మరిన్ని వివరాలను వెల్లడించే వరకు వేచి ఉండాల్సిందే.

Flipkart Big Saving Days sale date revealed
Redmi Note 12 Pro+ 5G :
రెడ్‌మి నోట్ 12 Pro+ 5G కూడా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్ ఫోన్ ధరను మరింత తగ్గించనుంది. తక్కువ ధరకే 5G ఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇదే బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.
Google Pixel 7 :
పిక్సెల్ 7 కేవలం రెండు నెలల క్రితమే రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series) రూ. 50వేల లోపు అందుబాటులో ఉంటుంది. ఈ అద్భుతమైన డీల్ పొందాలంటే.. అదనంగా, Pixel 7 Pro డిస్కౌంట్ ధర ట్యాగ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. కచ్చితమైన తగ్గింపు ధర ఇంకా వెల్లడి కాలేదు.
Nothing Phone (1) :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1) కూడా తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. ఫైనల్ ధరను వెల్లడించలేదు. అయితే, ఫోన్ రూ. 30వేల లోపు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కచ్చితమైన తగ్గింపు ధర ఇంకా వెల్లడి కాలేదు.