Flipkart Big Upgrade Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈరోజే లాస్ట్.. ఈ ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Flipkart Big Upgrade Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 15 ప్రో మరిన్ని ఫోన్లపై భారీ తగ్గింపు పొందవచ్చు.

Big discount on iPhone 15, iPhone 14, iPhone 15 Pro and more
Flipkart Big Upgrade Sale : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో బిగ్ అప్‌గ్రేడ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ రాత్రికే ఈ బిగ్ సేల్ ముగియనుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13 మరిన్ని వంటి పాపులర్ ఐఫోన్లు అమ్మకానికి ఉన్నాయి. ఐఫోన్ ప్రో వెర్షన్లను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. గత 5 నెలల క్రితమే లాంచ్ అయిన ఐఫోన్ 15 మోడల్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.66,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్లపై మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు :
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపు అందిస్తోంది. తద్వారా ఐఫోన్ 15 ధరను రూ.65,999కి విక్రయిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు రూ. 2,750 తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 15 ధరను రూ.64,249కి తగ్గించవచ్చు. వాస్తవానికి భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 రూ.79,900కి కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు కాకుండా ఫ్లిప్‌కార్ట్ రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900గా ఉండగా.. ఐఫోన్ కొనుగోలుదారులు 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,27,990కు తగ్గింది. వినియోగదారులు మొత్తం రూ.6,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా 10 శాతం తగ్గింపు లేదా యూపీఐ లావాదేవీలపై రూ. 750 తగ్గింపు పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 14ని రూ. 57,999 తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, సిటీ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన కొనుగోలుదారులు ఈ డివైజ్‌పై అదనంగా రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 13 మోడల్ ధర రూ. 52,999కు కొనుగోలు చేయొచ్చు.