ఆఫర్స్ బీభత్సం : ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా

ఆఫర్స్ బీభత్సం : ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా

మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపులు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మొదలై ఐదు రోజులు జరగనున్న ఈ డిస్కౌంట్ కార్యక్రమం 23వ తేదీ వరకూ కొనసాగనుంది. ఫ్లిఫ్‌కార్ట్ భారీ తగ్గింపులే కాకుండా ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లతో మార్కెట్‌ను ఊపేసేందుకు సిద్దమైంది. ఈ సదుపాయాన్ని కస్టమర్లకు అందించేందుకు యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్ కార్ట్.. 10శాతం డిస్కౌంట్‌ను అంటే (రూ.1500వరకూ) ఇవ్వనుంది. 

ఈ ఆఫర్లు మార్కెట్‌లోకి వచ్చిన తొలి రోజే కొనుగోలు చేస్తే ఎక్కువ మొబైల్‌లు, ఎక్కువ మోడళ్లలో సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది మరి. టాప్ మోడల్ నుంచి సాధారణమైన మోడల్ మొబైల్‌ల వరకూ.. అందుబాటు ధరల్లో సామాన్యుణ్ని కూడా ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లకు సిద్ధమైపోండి. భారీ డిస్కౌంట్ సదుపాయం కల్పించిన ఫోన్ల వివరాలిలా ఉన్నాయి. 

1. రియల్ మీ 2 ప్రొ రూ.12,990 (అసలు ధర రూ.14,990) 
2. రెడ్ మీ నోట్ 6 ప్రొ రూ. 12,999 (అసలు ధర రూ.15,999)
3. ఐఫోన్ XR రూ. 67,999 (అసలు ధర రూ.76,900)
4. జెన్ ఫోన్ Max Pro M2రూ. 11,999 (అసలు ధర రూ.15,999)
5. హానర్ 9N రూ. 8,499 (అసలు ధర రూ.13,999)
6. శాంసంగ్ గెలాక్సీ S8 రూ. 30,990 (అసలు ధర రూ. 49,990)
7. నోకియా ప్లస్ రూ. 8,999 (అసలు ధర రూ.13,199)
8. నోకియా 6.1 ప్లస్ రూ. 13,999 (అసలు ధర రూ.17,600)
9. జెన్ ఫోన్ లైట్ L1 రూ. 4,999 (అసలు ధర రూ.6,999)
 

Read Also : మడతబెట్టే 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే

Read Also : తెలుగులో కూడా పేటీఎం సేవలు