ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ప్రస్తుతం ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ఉంది. ఐఫోన్ 16 గత సంవత్సరం విడుదలైన విషయం తెలిసిందే. డిస్కౌంట్ ఉన్నప్పుడు ఐఫోన్ కొనాలని చూస్తున్న వారు వెంటనే ఆర్డర్ చేసుకోవాలి. ఈ ఆఫర్ ఎక్కువ కాలం ఉండదు.
iPhone 16 డిస్కౌంట్ వివరాలు
ఐఫోన్ 16.. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఆర్పీ రూ.79,900. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 6 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ధర రూ. 74,900కి ధర తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో ధర ఇంకా తగ్గుతుంది.
కై బ్యాంక్ కార్డు (Kai Bank)తో రూ.6000 డిస్కౌంట్ అందుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ.6,120 తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.61,700 వరకు తగ్గే అవకాశం ఉంది. నెలకు రూ.6,242తో ఈఎంఐ ఆప్షన్‌లోనూ కొనుక్కోవచ్చు.
Also Read: తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 పవర్‌ఫుల్ టాబ్లెట్లు ఇవే
Apple iPhone 16 ఫీచర్లు
ఇది లేటెస్ట్ ఐఫోన్. 6.1-ఇంచ్ సూపర్ రెటినా ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 1179 x 2556 పిక్సెల్స్, ఎ18 బయోనిక్ చిప్‌సెట్ ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఇస్తుంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 3561ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
కాగా, ఈ ఏడాది Apple iPhone 17 విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ ఫోన్ కోసం వేచి చూడకుండా ఐఫోన్ 16నే ఆఫర్‌లో కొనేద్దామనుకుంటున్న వారికి ఇది మంచి ఛాన్స్.
NOTE: ఆన్‌లైన్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న వస్తువుల ధరలు మారుతూ ఉంటాయి. కొనే సమయంలో ధరలను పరిశీలించాలి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి Apple iPhone 16పై ఆఫర్ అందుబాటులో ఉంది.