తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 పవర్‌ఫుల్ టాబ్లెట్లు ఇవే
బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే మరింత ధర తగ్గుతుంది.

ఆన్‌లైన్ లెర్నింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఓటీటీ కంటెంట్ కోసం టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? మార్కెట్లో కొన్ని పవర్‌ఫుల్ టాబ్లెట్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. రూ.9,999- రూ.14,000 మధ్య ధర ఉండేవి కొనాలని మీరు అనుకుంటుంటే అమెజాన్‌లో లభ్యమవుతున్న ఈ 5 పవర్‌ఫుల్ టాబ్లెట్ల గురించి తెలుసుకోవాల్సిందే.
Lenovo Tab M11
అమెజాన్‌లో దీని ధర రూ.10,999. రూ.1,000 కూపన్ డిస్కౌంట్ ఉపయోగించుకుంటే ధర రూ.9,999కు తగ్గుతుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే ఇంకా తక్కువ అవుతుంది. ఇది వైఫై టాబ్లెట్. క్వాడ్ స్పీకర్లు, మీడియాటెక్ హెలియో G88 ప్రాసెసర్, 11-ఇంచ్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 7040ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. బరువు 465 గ్రాములు.
Redmi Pad SE 4G
అమెజాన్‌లో దీని ధర రూ.10,499. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే మరింత తగ్గుతుంది. ఇది 4జీ టాబ్లెట్. రెండు స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, హెలియో G55 ప్రాసెసర్, 6650ఎంఏహెచ్ బ్యాటరీ, 8.7-ఇంచ్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
Also Read: రూ.25 వేలలోపే అందుబాటులో ఉన్న టాప్ 5 ల్యాప్‌టాప్స్ ఇవే..
Honor Pad X8a
అమెజాన్‌లో దీని ధర రూ.13,430. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే తగ్గుతుంది. ఇది వైఫై టాబ్లెట్. ఫ్రీ ఫ్లిప్‌కవర్ ఉంటుంది. 11-ఇంచ్ స్క్రీన్, క్వాడ్ స్పీకర్లు, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ టాబ్లెట్ బరువు 495 గ్రాములు.
Honor Pad X9
అమెజాన్‌లో దీని ధర రూ.13,999. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే మరింత తగ్గుతుంది. ఇది వైఫై టాబ్లెట్. ఫ్రీ ఫ్లిప్‌కవర్ అందుతుంది. ఆరు స్పీకర్లు, స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్, 7250ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 11.5-ఇంచ్ డిస్‌ప్లే ఉంటాయి. బరువు 495 గ్రాములు.
Redmi Pad 2
అమెజాన్‌లో దీని ధర రూ.13,999. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే మరింత ధర తగ్గుతుంది. యాక్టివ్ పెన్ సపోర్ట్ ఉంటుంది. నాలుగు స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, హెలియో G100-అల్ట్రా ప్రాసెసర్, 11-ఇంచ్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 9000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.