Top 5 laptops: రూ.25 వేలలోపే అందుబాటులో ఉన్న టాప్‌ 5 ల్యాప్‌టాప్స్‌ ఇవే..

మల్టీటాస్కింగ్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది.

Top 5 laptops: రూ.25 వేలలోపే అందుబాటులో ఉన్న టాప్‌ 5 ల్యాప్‌టాప్స్‌ ఇవే..

Updated On : June 29, 2025 / 5:13 PM IST

ప్రస్తుతం ల్యాప్‌టాప్ ప్రతి ఒక్కరికీ అవసరమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. విద్యార్థులు, ఆఫీస్ వర్కర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఎవరికైనా మంచి ల్యాప్‌టాప్ అవసరం. రూ.25,000లోపే అమెజాన్‌లో మంచి ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ ధరలో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ను కొనాలనుకుంటున్న వారు ఈ టాప్‌-5 ల్యాప్‌టాప్‌లను చూడండి..

Lenovo V15
ఈ ల్యాప్‌టాప్‌ 15.6-ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ఆంటీ గ్లేర్ స్క్రీన్‌తో వచ్చింది. 8జీబీ ర్యామ్, ఇంటెల్ సెలెరాన్ N4500 ప్రాసెసర్ సపోర్ట్‌తో స్మూత్‌గా పని చేస్తుంది. 256జీబీ ఫాస్ట్ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఉంటుంది. అమెజాన్‌లో డిస్కౌంట్‌లో రూ.19,945కే అందుబాటులో ఉంది.

HP 250 G9
ఈ ల్యాప్‌టాప్‌ 15.6-ఇంచ్ స్క్రీన్, సెలెరాన్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఎస్‌ఎస్‌డీ సపోర్ట్‌తో వేగంగా పని చేస్తుంది. భారీ తగ్గింపుతో ధర రూ. 23,990కే అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: ఇన్ఫినిక్స్ నుంచి మార్కెట్లో తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్‌ను ఊపేసే ఛాన్స్‌.. ఎందుకంటే?

Lenovo ThinkPad T495
ఈ ల్యాప్‌టాప్‌ అప్‌గ్రేడ్ వర్షన్‌లో 512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్, రైజెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. మల్టీటాస్కింగ్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుత అమెజాన్‌లో రూ.22,099కి లభ్యమవుతోంది.

ASUS VivoBook Go 14
ఈ ల్యాప్‌టాప్‌ 14-ఇంచ్ డిజైన్, 256జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో వచ్చింది. సెలెరాన్ N4500 ఇంజిన్ డేలీ వర్క్స్‌కు తగిన పనితీరు అందిస్తోంది. విద్యార్థులు లేదా ట్రావెలర్స్‌కు బెస్ట్. విండోస్ 11తో వచ్చింది. దీని ధర రూ.23,000గా ఉంది.

Lenovo IdeaPad 1
పవర్‌ఫుల్ ఇంటెల్ ప్రాసెసర్, విండోస్ 11 హోమ్ సపోర్ట్‌తో ఈ ల్యాప్‌టాప్ వచ్చింది. 15-ఇంచ్ స్క్రీన్, బరువు కేవలం 1.3కేజీతో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ధర రూ. 23,890కు లభిస్తోంది.

NOTE: అమెజాన్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న వస్తువుల ధరలు మారుతూ ఉంటాయి. కొనే సమయంలో ధరలను పరిశీలించాలి.