Yahoo Out : చైనాకు షాక్.. ఇకపై మాదారి మాది.. యాహూ గుడ్‌బై!
డ్రాగన్ చైనాకు గట్టి షాకిచ్చాయి విదేశీ టెక్ దిగ్గజాలు.. చైనా నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. యాహూ ఇంక్ (Yahoo Inc) కూడా చైనాకు గుడ్‌బై చెప్పేసింది.

Foreign Tech Firms Such As Yahoo, Linkedin And Epic Games Are Pulling Out Of China, Here's Why
Yahoo.inc Out China : డ్రాగన్ చైనాకు గట్టి షాకిచ్చాయి విదేశీ టెక్ దిగ్గజాలు.. చైనా నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు చైనాను విడిచిపెట్టగా.. తాజాగా యాహూ ఇంక్ (Yahoo Inc) కూడా చైనాకు గుడ్ బై చెప్పేసింది. చైనాలో ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. విదేశీ టెక్ దిగ్గజాలు ఒకదాని తర్వాత మరొకటిగా చైనా మార్కెట్ నుంచి వైదొలిగిపోతున్నాయి. చైనాలో కార్యకలాపాలు సాగించడం కష్టతరంగా మారిన నేపథ్యంలో యాహూ అక్కడి నుంచి నిష్ర్కమించడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యాహూ సర్వీసులను చాలావరకూ చైనా నిలిపివేసింది.
దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై చైనా ప్రభుత్వం నియంత్రిత దోరణితో వ్యవహరిస్తోంది. ప్రస్తుత రోజుల్లో ఈ దోరణీ తారా స్థాయికి చేరుకుంది. దాంతో చైనా తీరుతో విసిగిపోయిన విదేశీ టెక్ దిగ్గజాలు డ్రాగన్ మార్కెట్ నుంచి నిష్ర్కమించడమే సరైనదిగా గట్టిగా నిర్ణయించుకున్నాయి. చైనా ప్రధాన భూభాగంలో తమ కార్యకలాపాలను విదేశీ టెక్నాలజీ కంపెనీలు ఉపసంహరించుకుంటున్నాయి. చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల (డేటా గోప్యతా చట్టం) అమలుకు సంబంధించి పరిస్థితులు కఠినతరంగా మారుతున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి యాహూ సర్వీసులు నిలిచిపోతాయని ఇప్పటికే కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!
చైనా అతి పెద్ద మార్కెట్ అయినా.. కఠినతరమైన ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయాల్సి రావడంతో అక్కడి టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. దాంతో అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చాలా ఏళ్ల క్రితమే చైనా నుంచి నిష్ర్కమించింది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం LinkedIn సైతం తమ చైనా సైట్‌ను వీడుతున్నట్టు గత నెలలోనే ప్రకటించింది. ఇదివరకే లింక్ డిన్ సహా Epic Games కంపెనీ కూడా చైనా నుంచి వైదొలిగింది. మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ LinkedIn ఈ ఏడాదిలో తన సైట్ చైనీస్ వెర్షన్‌ను మూసివేస్తామని వెల్లడించింది. సోషల్ నెట్‌వర్కింగ్ ఫంక్షనింగ్ లేని జాబ్స్ బోర్డ్‌తో భర్తీ చేస్తామని తెలిపింది. ప్రముఖ వీడియో గేమ్ ఫోర్ట్‌నైట్‌ను నిర్వహించే ఎపిక్ గేమ్స్ కూడా నవంబర్ 15 నాటికి చైనా మార్కెట్ నుంచి గేమ్‌ను ఉపసంహరించుకుంటామని వెల్లడించింది. ఈ గేమ్ చైనాలో అతిపెద్ద గేమింగ్ కంపెనీ టెన్సెంట్ (tencent) భాగస్వామ్యంతో ప్రారంభించగా.. ఎపిక్‌లో 40శాతం వాటా కలిగి ఉంది.
కంపెనీలు.. చైనాను ఎందుకు విడిచిపెడుతున్నాయంటే?
నవంబరు 1 నుంచి అమలులోకి వచ్చిన వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం సమాచార కంపెనీల సంఖ్యను సేకరించేందుకు అనుమతినిస్తుంది. డేటాను ఎలా స్టోర్ చేయాలి అనేదానిపై ప్రమాణాలను నిర్దేశిస్తుంది. డేటాను సేకరించాలంటే.. కంపెనీలు తప్పనిసరిగా వినియోగదారుల సమ్మతిని పొందాలి. డేటా షేరింగ్‌ని నిలిపివేయడానికి యూజర్లకు అనుమతించాలి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు పంపేందుకు కంపెనీలు తప్పనిసరిగా అనుమతి పొందాలి. ఈ కొత్త చట్టం ద్వారా సమ్మతి ఖర్చులను పెంచుతుంది. చైనాలో పనిచేస్తున్న పాశ్చాత్య కంపెనీలకు అనిశ్చితిని పెంచుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50 మిలియన్ యువాన్లు ($7.8 మిలియన్లు) లేదా వారి వార్షిక ఆదాయంలో 5శాతం వరకు జరిమానా విధించడం జరుగుతుంది.
చైనీస్ రెగ్యులేటర్లు సాంకేతిక సంస్థలపై విరుచుకుపడ్డారు. కొన్ని కంపెనీలు డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. టెలికాం డివైజ్‌ల దిగ్గజం Huawei ఇతర చైనీస్ టెక్ కంపెనీలకు చైనా సైన్యం, ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వాషింగ్టన్ ఆంక్షలు విధించింది. అలీబాబా వంటి ఈ-కామర్స్ కంపెనీలు కూడా జరిమానాలను చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. స్థానిక కంపెనీలు కూడా ఈ కొత్త చట్టం అమలుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Read Also : Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!