Twitter X Blue Ticks : ట్విట్టర్ (X) పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. ఇకపై ‘బ్లూ టిక్’ హైడ్ చేసుకోవచ్చు..!

Twitter X Blue Ticks : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ (X) పెయిడ్ బ్లూ టిక్ మెంబర్ల కోసం వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను హైడ్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఫీచర్ల ద్వారా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Twitter X Blue Ticks : ట్విట్టర్ (X) పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. ఇకపై ‘బ్లూ టిక్’ హైడ్ చేసుకోవచ్చు..!

formerly Twitter, now allows paid members to hide their blue ticks

Twitter X Blue Ticks : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్, ఎలన్ మస్క్ యాజమాన్యంలోని (X) గతంలో (Twitter) తమ పెయిడ్ బ్లూ టిక్ సభ్యుల వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను హైడ్ చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ట్విట్టర్ బ్లూ నుంచి X బ్లూకి సబ్ స్ర్కిప్షన్ పేరు మార్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ తప్పనిసరిగా సభ్యులను ప్రత్యేక ఫీచర్‌లను పొందడానికి అనుమతిస్తుంది.

ఇందులో యూజర్ ప్రొఫైల్‌పై బ్లూ టిక్ లేకుండానే పోస్ట్‌లను Undo/Edit చేయడం, లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేయడం వంటివి ఉంటాయి. స్టేటస్ సింబల్ తెలియకుండా ఉండేలా పెయిడ్ మెంబర్లకు కొత్త ఫీచర్‌లను ప్రయత్నించాలనుకునే కొంతమంది యూజర్లకు ఈ ఆప్షన్ ప్రయోజనకరంగా ఉంటుంది.

టెక్‌క్రంచ్ ప్రకారం.. మస్క్ X ‘About X Blue’ సభ్యత్వ సపోర్టు పేజీని కూడా అప్‌డేట్ చేసింది. ‘hide your checkmark’ అనే ఆప్షన్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. చందాదారుగా మీ అకౌంటులో మీ చెక్‌మార్క్‌ను హైడ్ చేయడానికి ఆప్షన్ ఎంచుకోవచ్చు. తద్వారా బ్లూ చెక్‌మార్క్ మీ ప్రొఫైల్, పోస్ట్‌లలో కనిపించదు. అయితే, చెక్‌మార్క్ ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో కనిపించవచ్చు. దాంతో మీకు బ్లూ టిక్ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారని వెల్లడిస్తుంది.

Read Also : Twitter X App : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ట్విట్టర్ రీబ్రాండెడ్ వెర్షన్ X ఇదిగో.. సబ్‌స్ర్కిప్షన్ సర్వీసుకు ‘ట్విట్టర్ బ్లూ’ పేరు..!

మీ చెక్‌మార్క్ హైడ్ చేయగానే కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. త్వరలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా మస్క్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త హైడ్ ఫీచర్ పని చేయడానికి X బ్లూ సభ్యులు సెట్టింగ్‌లో ‘profile customisation’ని ఓపెన్ చేయాలి. అలాగే, ‘hide the blue checkmark’ ఆప్షన్ ఎంచుకోవాలి. ట్విట్టర్ (X) తమ వినియోగదారులను ‘hide subscriptions’ అనుమతిస్తుంది. ఈ మార్పులు మాత్రమే కాకుండా.. X బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధర అలాగే ఉంటుంది. భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్‌లకు సభ్యత్వం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.

formerly Twitter, now allows paid members to hide their blue ticks

formerly Twitter, now allows paid members to hide their blue ticks

ట్విట్టర్ వెబ్ యూజర్లు నెలకు రూ.650 చెల్లించి ఈ బ్లూ టిక్ పొందవచ్చు. యాప్ వార్షిక ఛార్జీలు వరుసగా రూ. 9,400, రూ. 6,800 ఉంటాయి. X బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఎడిట్ పోస్ట్‌లు, హాఫ్ యాడ్స్, లాంగ్ పోస్ట్‌లు, టెక్స్ట్ ఫార్మాటింగ్ (వెబ్‌లో మీ పోస్ట్‌లలో టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్ మార్చడం), బుక్‌మార్క్ ఫోల్డర్‌లు, కస్టమ్ యాప్ ఐకాన్లు, కస్టమ్ నావిగేషన్, స్పేస్‌ల ట్యాబ్ యాక్సెస్‌కి యాక్సెస్ వంటి ఫీచర్‌లను ఆస్వాదించవచ్చు.

ఇప్పటికే మస్క్ X బ్రాండింగ్‌తో ట్విట్టర్ సర్వీసులను రీబ్రాండ్ చేశారు. అయినప్పటికీ, అధికారుల భద్రతా ఆందోళనల కారణంగా కంపెనీ తన ప్రధాన కార్యాలయంపై ఉన్న భారీ X లోగోను తొలగించవలసి వచ్చింది. చాలామంది స్థానికులు కూడా X లోగో పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి X యాప్‌ను ఎవరీథింగ్ యాప్‌గా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. X కేవలం రీబ్రాండింగ్ కన్నా ఎక్కువ అని మస్క్ స్పష్టం చేశారు. ఆర్థిక సర్వీసులను కూడా చేర్చాలని కంపెనీ భావిస్తోంది. డిజిటల్ పేమెంట్ సంస్థ అయిన PayPalలో ఉన్న రోజుల్లో x.com డొమైన్‌ను మస్క్ పొందారు. ఆ డొమైన్‌ను 2017లో PayPal నుంచి తిరిగి కొనుగోలు చేశాడు.

Read Also : Mark Zuckerberg Phone : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాడే ఫోన్ ఇదేనట.. ఐఫోన్ మాత్రం కాదు.. అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం..!