JioCinema Subscription : జియో ప్రీపెయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి..
JioCinema Subscription : రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో ఇప్పటికీ రూ. 195 క్రికెట్ ప్యాక్‌తో సహా ఎంపిక చేసిన ప్లాన్‌లపై ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

JioCinema Subscription
JioCinema Subscription : రిలయన్స్ జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల నుంచి జియోసినిమా ఫ్రీ యాక్సస్ తొలగించింది. ఇప్పుడు జియోసినిమా సబ్‌స్క్రిప్షన్ ఏ ప్లాన్‌తోనూ అందుబాటులో ఉండదు. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత జియోహాట్‌స్టార్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
జియో వెబ్‌సైట్‌లో రూ.249 ప్లాన్ నుంచి రూ.3,599 వరకు ఉన్న అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలోని బెనిఫిట్ లిస్ట్ నుంచి జియోసినిమాను తొలగించింది. ఇప్పుడు జియో యూజర్లు జీయోటీవీ, జియోక్లౌడ్‌లను మాత్రమే ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అయితే, కొన్ని ఎంపిక చేసిన ప్లాన్‌లు ఇప్పటికీ జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి.
ఈ జియో ప్లాన్లలో జియోసినిమా రాదు :
జియో వెబ్‌సైట్‌లో రూ.249 నుంచి రూ.3,599 వరకు అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో జియోసినిమా యాక్సస్ చేయలేరు. ఇప్పుడు జియో టీవీ, జియో క్లౌడ్ మాత్రమే ఫ్రీగా వీక్షించవచ్చు. జియో సినిమా ఇకపై ప్రత్యేక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కాదని గమనించాలి.
కానీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో విలీనం తర్వాత జియో హాట్‌స్టార్‌గా మారింది. జియో హాట్‌స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్ నెలకు రూ.149 నుంచి అందుబాటులో ఉంది. 720p క్వాలిటీలో మొబైల్ స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. అదే సమయంలో, జియో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.299, సంవత్సరానికి రూ.1,499కి అందుబాటులో ఉంది.
ఈ జియో ప్లాన్లలో జియో హాట్‌స్టార్ చూడొచ్చు :
జియో ఇప్పటికీ కొన్ని ఎంపిక చేసిన ప్లాన్‌లలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా అందిస్తోంది.
రూ. 195 క్రికెట్ ప్యాక్ : 28 రోజుల వ్యాలిడిటీ, 15GB హై-స్పీడ్ డేటా. డేటా ఓన్లీ ప్యాక్.
రూ. 949 ప్లాన్ : 90 రోజుల వ్యాలిడిటీ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS.
జియో ఇప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లలో కొన్ని ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. ఇందులో Amazon Prime Video, FanCode, JioSaavn Pro, Netflix, ZEE5-SonyLIV కాంబో ఉన్నాయి.