Money Tasks March : మార్చి 31లోగా ఇవి తప్పక పూర్తి చేయండి.. లేదంటే అంతే..!
Money Tasks March : కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ప్రతి ఏడాదిలోనూ మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది.

From Filing Belated Itr To Updating Bank Kyc This Money Tasks To Complete Before March 2022
Money Tasks March : కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ప్రతి ఏడాదిలోనూ మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. పాత నిబంధనలు కూడా
మారిపోతాయి. ఆ స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా.. మార్చి 31తో ఆర్థిక
సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కొన్ని పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది.. అవేంటో ఓసారి చూద్దాం..
KYC Update (కేవైసీ అప్‌డేట్) :
బ్యాంక్ అకౌంట్లో KYCని తప్పక పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనిగడువు కూడా మార్చి 31 వరకు ఉంటుంది. పాన్ అడ్రస్ ధృవీకరణ, బ్యాంక్ సంబంధిత ఇతర డేటాతో సహా కేవైసీని అప్ డేట్ చేసుకోవాలి.
పాన్ నెంబర్ – ఆధార్ లింకు (Pan -Aadhaar) Link :
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింకు తప్పనిసరిగా చేసుకోవాలి. దీని గడువు తేదీ కూడా మార్చి 31, 2022 వరకు ఉంది. గతంలోనే సెప్టెంబర్ 30,2021న తేదీని పొడిగించింది. ఈ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వెంటనే అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్లను లింక్ చేసుకోవాలి. లేదంటే.. ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 272B కింద రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు.
పన్ను ఆదా (Tax Saving) :
ఈ ఏడాదిలో మీ ఆదాయం ఎంతో తెలుసా? అయితే మీరు సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ మొదలైన పన్ను ఆదా స్కీముల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. మార్చి 31లోపు ఈ పనులు పూర్తి చేయాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.. లేదంటే ఆ అకౌంట్ క్లోజ్ కావొచ్చు.
ఆదాయపు పన్ను రిటర్న్ (Income Tax Returns) :
AY 2021-22 సంవత్సారానికిగానూ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయతే ఈ గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. జరిమానా పడకుండా ఉండాలంటే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను గడువు తేదీలోగా దాఖలు చేయడానికి ప్రయత్నించండి..