Flipkart
Apple iPhone: సొగసోంపైనా యాపిల్ ఐఫోన్ అంటే మొబైల్ ఫోన్ ప్రియులకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ లలో యాపిల్ ఒక ధృడమైన బ్రాండ్ అయితే, ఐఫోన్ ఒక అద్బుతమనే చెప్పాలి. అటువంటి ఐ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు తహతహలాడుతుంటారు. అయితే ఫోన్ ధరను చూసి వెనకడుగు వేస్తుంటారు. ఇపుడు ఈ వార్త చూశాక.. ఐ ఫోన్ కొనకుండా ఉండలేరు. ఎందుకంటే ఐఫోన్ ఇపుడు రూ.17,800కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటే.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్..”బిగ్ బచత్ ధమాల్” పేరుతో మార్చి 4 నుంచి మార్చి 6 వరకు భారీ డిస్కౌంట్ సేల్ ప్రారంభించింది. ఇందులో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలను డిస్కౌంట్ లో అందిస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్ లో భాగంగా ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది సంస్థ.
Also read: Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ధర రూ.32,000 ఉండగా..ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.17,800కే లభిస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.39,900 ఉండగా..డిస్కౌంట్ లో రూ.30,299కే లభిస్తుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ లో గరిష్టంగా రూ.14,800 తగ్గించి..రూ.15,499కే ఐఫోన్ ఎస్‌ఈ లభిస్తుంది. ఈ మెగా ఆఫర్ తో పాటుగా వివిధ రకాల బ్యాంకుల డెబిట్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక మరో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లోనూ ఐఫోన్ పై గరిష్టంగా రూ.14,900 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ నడుస్తుంది. యాపిల్ సంస్థ మార్చి 8న కొన్ని కొత్త మోడల్స్ ను తీసుకురానున్న నేపథ్యంలో.. ప్రస్తుతం స్టాక్ ఉన్న మోడల్స్ పై ఈమేరకు డిస్కౌంట్లు ప్రకటించిందని, అందుకే ఇంత తక్కువ ధరకు ఐఫోన్ లభిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: West Bengal Beggar : మృతి చెందిన యాచకురాలు.. రూ. లక్షకు పైగా నగదు