West Bengal Beggar : మృతి చెందిన యాచకురాలు.. రూ. లక్షకు పైగా నగదు

కనికా ఉంటున్న గదిలో గోనె సంచులు, ట్రంకుల్లో భారీగా నగదు ఉండడం చూసి ఆశ్చర్యపోయామని పొరుగున నివాసం ఉంటున్న నిఖిల్ దాస్ వెల్లడించారు. అనంతరం దీనిపై తాము పోలీసులకు సమాచారం అందించడం...

West Bengal Beggar : మృతి చెందిన యాచకురాలు.. రూ. లక్షకు పైగా నగదు

West Bengal

West Bengal Woman Beggar : వెస్ట్ బెంగాల్ లో చనిపోయిన ఓ యాచకురాలు వద్ద లక్ష రూపాయలకు పైగా నగదు ఉండడం అందర్నీ ఆశ్చర్యపరించింది. నార్త్ దినాజ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ 40 సంవత్సరాల కనిక మహంతగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా బిచ్చమెత్తుకుంటూ యాచిస్తూ సాగించేందుకు ఆమె ఇస్లాంపూర్ లోని లోక్ నాథ్ కాలనీలో ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది. కనికకు వృద్ధురాలైన తల్లి, తోబట్టువులు కూడా ఉన్నారు. వీరు కూడా యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు కనికా చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు అంత్యక్రియల కోసం ఆమె ఉంటున్న ఇంటిని చూడాలని ఇరుగుపొరుగు వారిని అభ్యర్థించారు.

Read More : Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్

కనికా ఉంటున్న గదిలో గోనె సంచులు, ట్రంకుల్లో భారీగా నగదు ఉండడం చూసి ఆశ్చర్యపోయామని పొరుగున నివాసం ఉంటున్న నిఖిల్ దాస్ వెల్లడించారు. అనంతరం దీనిపై తాము పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఆగిపోయిన లెక్కింపు కొనసాగుతుందని దాస్ తెలిపారు. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని, అప్పటి వరకు గదికి తాళం వేశారన్నారు. ఎక్కువ మొత్తంలో రూ. 5, 10 నాణెలు, రూ. 20 నోట్లు, మొత్తం రూ. 1.07 లక్షలుగా లెక్కించారు.

Read More : Road Accident: ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

ఇంత డబ్బు పొదుపు చేసిన విషయం తమకు తెలియదని కనికా సోదరుడు బబ్లూ తెలిపారు. డబ్బు గురించి తెలిస్తే.. కనికకు, అనారోగ్యంతో ఉన్న తమ తల్లికి వైద్య చికిత్స చేయించేవారమన్నారు. కనికా అంత్యక్రియల కోసం కొంత ఖర్చు అవుతుందని, మిగతా డబ్బును కనికా తల్లి, వారి తోబుట్టువుల పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేస్తామని ఇరుగుపొరుగు వారు వెల్లడించారు.