Google For India : గూగుల్‌లో కొత్త మల్టీసెర్చ్ ఫీచర్.. ఇకపై ఫొటోలు, స్ర్కీన్‌షాట్లతో ఏదైనా సెర్చ్ చేయొచ్చు.. ఎలా వాడాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
Google For India 2022 : గూగుల్ ఇటీవలే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 2022 (#GoogleForIndia2022) ఈవెంట్ నిర్వహించింది. గూగుల్ అందించే పలు సర్వీసుల్లో యూట్యూబ్ సహా మరెన్నో సర్వీసుల కోసం సరికొత్త ఫీచర్లను ప్రకటించింది.
Google announces new multisearch feature lets you search using photos and screenshots, how to use
Google For India 2022 : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఇటీవలే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 2022 (#GoogleForIndia2022) ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా గూగుల్ అందించే పలు సర్వీసుల్లో యూట్యూబ్ సహా మరెన్నో సర్వీసుల కోసం సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. గూగుల్ వినియోగదారులకు మెరుగైన సెర్చ్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టెక్ కంపెనీ సెర్చ్ కోసం అనేక ఆసక్తికరమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. అందులో మల్టీసెర్చ్ ఆప్షన్ ఫీచర్ ఒకటి.
ఈ కొత్త మల్టీ సెర్చ్ ఫీచర్ చాలా కాలంగా యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మల్టీసెర్చ్ ఫీచర్ (Google Multisearch Feature)తో వినియోగదారులు ఫోటోలు లేదా స్క్రీన్‌షాట్‌లను ఉపయోగించి Google సెర్చ్‌లో ఏదైనా సెర్చ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ని ఉపయోగించి ఏదైనా సెర్చ్ చేయడానికి వినియోగదారులు కెమెరా ఐకాన్ ఉపయోగించి ఫొటోను క్లిక్ చేయవచ్చు.
ఫొటో గ్యాలరీ (Google Photos) నుంచి ఫోటోను అప్‌లోడ్ చేయవచ్చు లేదా స్క్రీన్‌షాట్‌ను యాడ్ చేయవచ్చు. గూగుల్‌లో ఫొటో అప్‌లోడ్ చేయగానే Google సెర్చ్ సంబంధిత రిజిల్ట్స్ చూపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఒక దుస్తుల ఫొటోను క్లిక్ చేసి యాడ్ చేస్తే.. Google ఒకే రకమైన ఫాబ్రిక్, డిజైన్ లేదా ప్యాటర్న్‌తో బట్టలను సెర్చ్ ఫలితాల్లో చూపిస్తుంది. ఇప్పుడు, ఈ ఆప్షన్ Google Lensని ఉపయోగించి పనిచేస్తుంది.

Google For India 2022 : Google announces new multisearch feature lets you search using photos
ఈ గూగుల్ లెన్స్ అనేది ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనికి అదనంగా మల్టీ సెర్చ్ ఆప్షన్ కూడా యాడ్ అయింది. దీంతో వినియోగదారులు చాలా నిర్దిష్టమైన విషయాల కోసం సెర్చ్ చేయవచ్చు. ఉదాహరణకు.. మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోలో కనిపించే దుస్తుల మాదిరిగానే మీరు స్కర్ట్ కోసం చూస్తున్నారా? అయితే మీరు స్క్రీన్ పైభాగంలో టెక్స్ట్ యాడ్ చేయాలి. Google ఇప్పుడు సంబంధిత సెర్చ్ ఫలితాలను చూపిస్తుంది. మల్టీసెర్చ్ ఫీచర్ (Multisearch Feature) ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. హిందీ భాషతో ప్రారంభించి దీనికి మరిన్ని భాషా సపోర్టును యాడ్ చేసేందుకు Google ధృవీకరించింది. ఈ ఫీచర్ వినియోగదారులు ఇమేజ్‌లు, టెక్స్ట్ రెండింటినీ ఉపయోగించి సరిగ్గా దేని కోసం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇంతకీ మల్టీసెర్చ్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
* Google యాప్‌ను ఓపెన్ చేయండి.
* Search Boxపై Click చేయండి.
* కెమెరా ఐకాన్‌పై Click చేయండి.
* మీరు ఫోటోను క్లిక్ చేయవచ్చు లేదా గ్యాలరీ నుంచి ఫొటోలను యాడ్ చేయవచ్చు.
* మీరు స్క్రీన్‌షాట్‌లను కూడా యాడ్ చేయవచ్చు.
* Google సంబంధిత సెర్చ్ ఫలితాలను చూపదు.
* మల్టీసెర్చ్ ఫీచర్‌ని ఉపయోగించడానికి, స్క్రీన్‌పై స్వైప్ చేయాలి.
* ‘add to your search’ బార్‌కి Text యాడ్ చేయండి.
* మీ అవసరాలకు అనుగుణంగా Google నిర్దిష్ట రిజల్ట్స్ చూపించదని గమనించాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
