Google AI Mode : భారతీయ యూజర్ల కోసం కొత్త గూగుల్ AI మోడ్ టూల్.. సెర్చ్‌లో ఏది అడిగినా ఎలా అడిగినా వెతికి మరి అందిస్తుంది..!
Google AI Mode : భారతీయ వినియోగదారులకు గూగుల్ AI మోడ్ ఇన్ సెర్చ్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Google AI Mode
Google AI Mode : భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఏఐ మోడ్ టూల్ వచ్చేసింది. ఈ ఏఐ మోడ్ ఇన్ సెర్చ్‌ను గూగుల్ సాంప్రదాయ సెర్చ్ ఇంజిన్‌లో (Google AI Mode) విలీనం చేసింది. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సెర్చ్ రిజల్ట్స్ వివరణాత్మక, సందర్భోచిత సమాధానాలను అందిస్తుంది.
ఈ లింక్‌ల లిస్టులో రిప్లయ్ ఇచ్చే సాంప్రదాయ సెర్చ్ మాదిరిగా కాకుండా, ఏఐ మోడ్ టూల్ ఉపయోగించి పూర్తి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. సంక్లిష్టమైన లేయర్డ్ ప్రశ్నలను డివైజ్ చేసి పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎలా అడిగినా ఏ విధంగా అడిగినా అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలను అందిస్తుంది.
ముందుగా అమెరికాలో అందుబాటులోకి :
వాస్తవానికి, ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ఈ ఏఐ ఫీచర్‌ను అమెరికాలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత జూన్‌లో సెర్చ్ ల్యాబ్స్ ద్వారా భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ట్రయల్స్, యూజర్ ఫీడ్‌బ్యాక్ తర్వాత గూగుల్ ఇప్పుడు ల్యాబ్స్ ద్వారా యూజర్లు సైన్ అప్ చేయాల్సిన అవసరం లేకుండా దేశమంతటా యాక్సెస్‌ను విస్తరిస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
గూగుల్ ఏఐ మోడ్ ఎలా పనిచేస్తుంది? :
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రకారం.. సెర్చ్ రిజల్ట్స్‌లో లోతుగా కంటెంట్ విశ్లేషించేందుకు వివరణాత్మకమైన యూజర్లకు ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చేందుకు వీలుగా ఏఐ మోడ్‌ను గూగుల్ రూపొందించింది. గూగుల్ జెమిని 2.5 మోడల్ వెర్షన్ ద్వారా పనిచేస్తుంది. అడిగిన ప్రశ్నకు వెబ్ మొత్తం సమాచారాన్ని సేకరిస్తూనే ఉప-ప్రశ్నలుగా డివైజ్ చేస్తుంది. చివరిగా సమాధానాన్ని వెలికితీస్తుంది. అవసరమైన లింక్‌లు, ఇతర ప్రశ్నలతో మరింత సెర్చ్ చేసేందుకు ఆప్షన్లను అందిస్తుంది.
AI మోడ్‌ను ఎలా వాడాలంటే? :
భారతీయ యూజర్లు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో గూగుల్ యాప్ సెర్చ్ బాక్సులో కొత్త “AI Mode” ట్యాబ్ ద్వారా ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఏఐ మోడ్‌తో మాట్లాడవచ్చు. అందుకు వినియోగదారులు ప్రశ్నలను టైప్ చేయాలి. లేదంటే వాయిస్ ఇన్‌పుట్ ద్వారా మాట్లాడాలి.
గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఉదాహరణకు.. వినియోగదారులు ఒక మొక్క ఫొటో తీసి ఎలా సంరక్షించాలో అడగవచ్చు.. అప్పుడు ఏఐ మోడల్ దశల వారీ సూచనలు చేస్తూ సంబంధిత కంటెంట్ లింక్‌లను అందిస్తుంది.
ప్రొడక్టుల కంపేరింగ్, ట్రావెలింగ్ ప్లాన్ చేయడం లేదా సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడం వంటి అంశాలపై సెర్చ్ చేసేందుకు ఏఐ మోడ్ ప్రయోజనకరంగా ఉంటుందని గూగుల్ పేర్కొంది. సాధారణ సెర్చ్ రిజల్ట్స్ కన్నా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ప్రశ్నలకు సరైన కంటెంట్ సూచించగలదని తెలిపింది.
ఈ ఫీచర్ ‘query fan-out’ అనే టెక్నిక్‌పై ఆధారంగా రన్ అవుతుంది. గూగుల్ సిస్టమ్ ఒక ప్రశ్నను డివైడ్ చేస్తుంది. తద్వారా మల్టీ సెర్చ్ చేయొచ్చు. స్టాండర్డ్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించని కంటెంట్‌ను కూడా ఈజీగా యాక్సస్ చేయొచ్చు.
ఏఐ మోడల్ లిమిట్స్ ఇవే :
భారత్‌లో AI మోడ్ ఇంగ్లీష్ భాషకే పరిమితం చేసింది గూగుల్. భవిష్యత్తులో ఇతర భాషలకు కూడా సపోర్టు అందించనుంది. ఈ ఏఐ టూల్ టెస్టింగ్ దశలోనే ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్ క్రమంగా రిలీజ్ చేయనుంది. రాబోయే రోజుల్లో డెస్క్‌టాప్, మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.