Google Doodle : టోక్యో ఒలింపిక్స్ 4వ రోజు : గూగుల్ డూడుల్‌లో ‘రగ్బీ’ స్పెషల్ గేమ్!

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఒలింపిక్స్ గేమ్స్ పై సరికొత్త డూడుల్ తో ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ మొదలైన నాల్గో రోజున గూగుల్ డూడుల్ పేజీలో రగ్బీ స్పెషల్ గేమ్ యాడ్ చేసింది.

Google Doodle : టోక్యో ఒలింపిక్స్ 4వ రోజు : గూగుల్ డూడుల్‌లో ‘రగ్బీ’ స్పెషల్ గేమ్!

Google Doodle Celebrates Day 4 Of Tokyo Olympics 2020

Updated On : July 27, 2021 / 12:37 PM IST

Tokyo Olympics 2020 : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఒలింపిక్స్ గేమ్స్ పై సరికొత్త డూడుల్ తో ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ మొదలైన నాల్గో రోజున గూగుల్ డూడుల్ పేజీలో రగ్బీ స్పెషల్ గేమ్ యాడ్ చేసింది. డూడుల్ చాంపియన్ ఐలాండ్ గేమ్స్ లో భాగంగా గత మూడు రోజుల నుంచి గూగుల్ యానిమేటెడ్ స్పెషల్ గేమ్స్ యాడ్ చేస్తోంది.

ఇప్పటికే గూగుల్ డూడుల్.. టెబుల్ టెన్నిస్, స్కేట్ బోర్డింగ్, ఆర్చరీ వంటి అనేక గేమ్స్ యూజర్ల కోసం అందించింది. ఈ యానిమేటెడ్ గేమ్స్ ను గూగుల్ డూడుల్ రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు రగ్బీ గేమ్ రిలీజ్ చేసింది. గూగుల్ జపనీస్ యానిమేషన్ స్టూడియో 4°C సహకారంతో ‘ఛాంపియన్ ఐలాండ్ గేమ్స్’ ప్రవేశపెట్టింది.

దీని ద్వారా గూగుల్ యూజర్లు టోర్నమెంట్‌ గేమ్స్ ఆడుకోవచ్చు. స్కేట్ బోర్డింగ్, రగ్బీ, క్లైంబింగ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ గేమ్స్ లో ఛాంపియన్స్ ప్లేయర్లను ఓడించేందుకు ట్రై చేయొచ్చు. ప్రత్యర్థులను మట్టికరిపించవచ్చు.. ఈ స్పెషల్ గేమ్స్ ఆడటం కోసం మీరు “https://www.google.co.in” సైట్ లోకి వెళ్లి డూడుల్ పై క్లిక్ చేస్తే చాలు.. మీకు నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు. ఈ టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.