Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ఫోన్లలో మరో కొత్త కలర్ ఆప్షన్ వచ్చేసింది.. మింట్ లుక్ అదిరింది..!
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్ల కోసం సరికొత్త మింట్ కలర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లలో ఎలాంటి మార్పులు లేకుండా యూజర్లకు సరికొత్త లుక్ ఆప్షన్ అందిస్తోంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Google introduces new colour for Pixel 8 and Pixel 8 Pro
Google Pixel 8 Series Colour Option : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ ఫోన్లలో సరికొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. లేటెస్టుగా గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో లైనప్‌లో లేటెస్ట్ మింట్ కలర్ ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఉన్న లైనప్‌లో కొత్తగా ఈ కలర్ ఆప్షన్ ఫోన్ వచ్చి చేరింది. గత పిక్సెల్ ఫోన్ జనరేషన్లలో కనిపించే గూగుల్ పాస్టెల్ లుక్ ఈ కొత్త గ్రీన్ మింట్ కలర్‌తోనూ మిక్స్ అయి ఉంటుంది.
పిక్సెల్ 8 సిరీస్‌లో కలర్ ఆప్షన్లు :
గూగుల్ పిక్సెల్ 8 ప్రో మోడల్ బే బ్లూ, అబ్సిడియన్, పోర్సెలైన్ కలర్ ఆప్షన్లు ఉండగా.. స్టాండర్డ్ పిక్సెల్ 8 మోడల్‌ల కోసం అబ్సిడియన్, హాజెల్, రోజ్‌లతో సహా ప్రస్తుత ఆప్షన్లలో కొత్త మింట్ కలర్ ఆప్షన్ వచ్చి చేరింది. పిక్సెల్ ఫోన్ తేలికపాటి షాడోతో ఆకట్టుకునేలా ఉంది.
ఆసక్తి ఉన్నవారికి మింట్ ఇప్పటికే ఉన్న రోజ్ కలర్‌కు భిన్నంగా ఆహ్లాదకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అయితే, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండింటి 128జీబీ మోడల్‌లకు మింట్ ప్రత్యేకంగా అందుబాటులో ఉందని గమనించడం ముఖ్యం. మీరు ఈ కలర్ ఆప్షన్ ఎంచుకుంటే.. స్టోరేజీ సామర్థ్యం విషయంలో తేడా ఉంటుంది.

Google Pixel 8 and Pixel 8 Pro
స్పెసిఫికేషన్లలో మార్పులు లేవు :
గూగుల్ కొత్త కలర్ ఆప్షన్‌తో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ప్రవేశపెట్టినప్పటికీ ఇతర స్పెసిఫికేషన్‌లు లేదా ఫీచర్‌లకు ఎలాంటి అప్‌డేట్‌లు లేదా మార్పులు లేవు. గూగుల్ ప్రధానంగా కలర్ ఆప్షన్లపైనే దృష్టి పెట్టింది. ఆపిల్ మాదిరిగానే వ్యూహాన్ని అనుసరిస్తుంది.
పిక్సెల్ 8 ధర, లభ్యత :
భారత మార్కెట్లో మింట్ కలర్ లభ్యత అనిశ్చితంగానే ఉంది. గూగుల్ ఇండియా స్టోర్‌లో పిక్సెల్ 8 మింట్ ఎంపిక కోసం మార్కెటింగ్ ప్రయత్నాలను చేస్తోంది. అయినప్పటికీ పిక్సెల్ 8 ప్రో లభ్యతపై అస్పష్టంగా ఉంది. భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. ఈ మోడల్ ఎప్పుడు జాబితా అయిందో లేదో ఇంకా ధృవీకరించలేదు. అందుబాటులో ఉన్నట్లయితే.. మింట్-కలర్ పిక్సెల్ 8 ఇతర కలర్ వేరియంట్‌ల మాదిరిగానే రూ.75,999 ధరకు లభిస్తుందని అంచనా.