Google Pixel 8 Pro Now Available in 256GB Storage Variant
Google Pixel 8 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 8 ప్రో (Pixel 8 Pro) తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో అక్టోబర్ 4న కంపెనీ మేడ్ బై గూగుల్ 2023 (Made By Google 2023 Event) ఈవెంట్‌లో ఈ ప్రో వేరియంట్ లాంచ్ అయింది.
గత అక్టోబర్ 12న గూగుల్ పిక్సెల్ 8 మోడల్ అమ్మకానికి వచ్చింది. లాంచ్ సమయంలో కంపెనీ సింగిల్ 12జీబీ ర్యామ్ + 128జీబీ ప్రో వేరియంట్‌ను ధర రూ. 1,06,999కు లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రో వేరియంట్ బే, అబ్సిడియన్, పొర్సిలియన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
బ్యాంకు ఆఫర్లతో రూ.9వేలు డిస్కౌంట్ :
సరిగ్గా నెల తర్వాత గూగుల్ పిక్సెల్ 8 ప్రో మరో స్టోరేజ్ మోడల్‌ను లాంచ్ చేసింది. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. కంపెనీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. పిక్సెల్ 8 ప్రో కొత్త స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,13,999కు అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 9వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ. 4వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తుంది.
Google Pixel 8 Pro Launch in India
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 ప్రో కొత్త వేరియంట్ కేవలం అబ్సిడియన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మాదిరిగా కాకుండా కలర్ల కోసం మూడు ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాదు.. గూగుల్ పిక్సెల్ 8 ప్రో 12జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. రూ . 1,06,999కు అందిస్తోంది. అదే బ్యాంక్ ఆఫర్‌లతో అందిస్తోంది. స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.
6.7-అంగుళాల క్వాడ్-హెచ్‌డీ (1,344×2,992 పిక్సెల్‌లు) స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రో, గూగుల్ టెన్సార్ G3 SoC, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ మెయిన్ సెన్సార్, రెండు 48ఎంపీ సెన్సార్‌లను కలిగి ఉంది. సెల్ఫీలకు 10.5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. పిక్సెల్ 8 ప్రో 5050mAh బ్యాటరీతో 30W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.