Google Pixel 9 Pro : వావ్.. పిక్సెల్ ఫోన్ ఇంత తక్కువా? గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై ఏకంగా రూ. 27,500 డిస్కౌంట్!
Google Pixel 9 Pro : కొత్త గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 85,399 ధరకు లభిస్తోంది. ఏకంగా రూ. 24,600 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 9 Pro
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర రూ. 1,09,999కు లాంచ్
- అమెజాన్‌లో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ రూ. 85,399 ధర తగ్గింపు
- బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు
Google Pixel 9 Pro : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే. మీరు కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో పిక్సెల్ 9 ప్రో ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రత్యేక ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ సుమారు రూ. 82,400కు సొంతం చేసుకోవచ్చు.
ఈ పిక్సెల్ ఫోన్లో ట్రిపుల్-కెమెరా సిస్టమ్, గూగుల్ టెన్సర్ చిప్సెట్, ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ పిక్సెల్ 9 కొనేందుకు ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పాలి. పూర్తి ఆఫర్లు, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ. 1,09,999 ప్రారంభ ధరతో వచ్చింది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 85,399కి లభిస్తోంది. రూ. 24,600 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు.
హెచ్ఎస్బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఫోన్ మోడల్, కండిషన్‌ను బట్టి రూ. 24,950 వరకు ఆదా చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 6.3-అంగుళాల ఎల్టీపీఓ డిస్ప్లేను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా పిక్సెల్ 9 ప్రో టెన్సర్ G4 చిప్సెట్తో వస్తుంది. 16GB ర్యామ్, 256GB స్టోరేజ్, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో కొనాలా? వద్దా? :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో సుమారు రూ. 82,400 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డిస్ప్లే ఉంది. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయొచ్చు.
ఈ డివైజ్‌కు గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. 16GB LPDDR5X ర్యామ్, రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్లో 4,700mAh బ్యాటరీ ఉంది. ధర పెద్దగా లేకున్నా సాధారణ వాడకంతో ఛార్జింగ్ రోజంతా వస్తుంది.
పిక్సెల్ 9 ప్రో కెమెరా పరంగా ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, మాక్రో ఫోకస్‌తో 48MP అల్ట్రావైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 30x వరకు సూపర్ రెస్ జూమ్‌ను అందించే 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ పిక్సెల్ ఫోన్ 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్, 60fps వద్ద 4K రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
