Google Banned Apps : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17యాప్‌లు ఔట్! అసలు కారణం ఏమిటంటే?

రుణాల పేరుతో దోపిడీచేసే యాప్ ల నుంచి వినియోగదారులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని గూగుల్ పేర్కొంది. గత సంవత్సరంలో ప్లే స్టోర్ నుంచి రెండు వందలకుపైగా స్పైలోన్ యాప్ లను ..

Google Banned Apps : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17యాప్‌లు ఔట్! అసలు కారణం ఏమిటంటే?

Google

Updated On : December 9, 2023 / 12:19 PM IST

Google Banned 17 Apps : నకిలీ రుణ యాప్ ల భారినపడి ఇబ్బంది పడుతున్న భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతీయేటా వందలాది మంది ఈ యాప్ ల బారినపడి బలవుతున్నారు. ఇన్‌స్టంట్ లోన్‌లు ఇప్పిస్తామనే పేరుతో దోపీడీతోపాటు వ్యక్తులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు వేల సంఖ్యలో యాప్ లపై చర్యలు తీసుకోబడ్డాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గూగుల్.. లోన్ యాప్ ల మోసపూరిత వృద్ధిని గమనించింది. చట్టబద్దమైన వ్యక్తిగత రుణ సేవలకు ఇవి విరుద్దంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. అలాంటి 17యాప్ లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.

Also Read : Google Chrome Update : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్ లు భారత్, పాకిస్థాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, ఇండోనేషియా, కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, పెరూ, ఫిలిప్పీన్స్, సింగపూర్, నైజీరియా వంటి దేశాల్లో పనిచేస్తున్నాయి. ఈ యాప్ లను ప్లే స్లోర్ నుంచి తలగించక ముందే 12 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు కలిగిఉన్నాయని గుర్తించారు.

Also Read : Google Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ ఇలాంటి అకౌంట్లను డిలీట్ చేస్తుంది.. పూర్తి వివరాలివే!

స్పైలోన్ యాప్ లు తమను తాము చట్టబద్ధమైన లోన్ ప్రొవైడర్లుగా మార్చుకుని డౌన్ లోడ్ చేసుకునేలా వినియోగదారులను మోసగిస్తున్నాయని గుర్తించారు. ఇన్ స్టాల్ చేసిన తరువాత, ఈ యాప్ లు తెలియకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు యాక్సెస్ ను పొందుతాయి. ఈ సమాచారంతో బాధితులను బ్లాక్ మెయిల్ చేయడానికి వినియోగిస్తున్నట్లు పరిశోధనలో గుర్తించారు. ఈ దోపిడీ యాప్ లు ఆర్థిక సహాయం అవసరమయ్యే వ్యక్తులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. ఈ యాప్ ల ద్వారా దరఖాస్తుల బాధితులు రుణాల వాస్తవ వార్షిక వ్యయం ప్రచారం చేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని, తిరిగి చెల్లించే వ్యవధి చట్టబద్దమైన బ్యాంకులు అందించే దానికంటే చాలా తక్కువగా ఉందని గుర్తించారు.

Also Read : WhatsApp Google Drive Backup : మీ వాట్సాప్ డేటా స్టోరేజీ బ్యాకప్.. గూగుల్ డ్రైవ్‌లో ఇక ఉచితం కాదు.. ఎందుకో తెలుసా?

రుణాల పేరుతో దోపిడీచేసే యాప్ ల నుంచి వినియోగదారులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని గూగుల్ పేర్కొంది. గత సంవత్సరంలో ప్లే స్టోర్ నుంచి రెండు వందలకుపైగా స్పైలోన్ యాప్ లను గూగుల్ తొలగించింది. అయితే, ఈ యాప్ లను డౌన్ లోడ్ చేయడం, ఇన్ స్టాల్ చేయడంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, తమను తాము రక్షించుకోవడానికి ముందు జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని గూగుల్ సూచించింది.