Google Play Store: ఈ మూడు యాప్స్ వెంటనే ఫోన్‌లో తీసెయ్యండి.. గూగుల్ కూగా బ్యాన్ చేసింది

మీ ఫోన్‌లో మీకు కనిపించని మాల్వేర్.. మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అవును.. ఇది నిజం..

Google Play Store: ఈ మూడు యాప్స్ వెంటనే ఫోన్‌లో తీసెయ్యండి.. గూగుల్ కూగా బ్యాన్ చేసింది

Google Play Store Apps Alert Hidden Joker Malware Returns

Updated On : October 14, 2021 / 4:37 PM IST

Google Play Store: మీ ఫోన్‌లో మీకు కనిపించని మాల్వేర్.. మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అవును.. ఇది నిజం.. ఈజీగా డబ్బు సంపాదనే మార్గంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. యాప్‌ల ద్వారా మీ ఫోన్‌లో దూరేస్తున్నారు. ప్రమాదకరమై యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా? వెంటనే చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి మిలియన్ల డాలర్లను దోచుకునే స్కెచ్ వేశారు సైబర్ నేరగాళ్లు.

ఇటువంటి ప్రమాదకరమైన మాల్వేర్‌లను గుర్తించి, ఇటీవల గూగుల్ 136 యాప్‌లను నిషేధించగా.. ఇదే మాదిరి మరో ప్రమాదకరమైన మూడు యాప్స్‌ని కూడా గూగుల్ లేటెస్ట్‌గా నిషేధించింది. గతంలో సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేసుకున్న గ్రిఫ్‌హోర్స్ ఆండ్రాయిడ్ ట్రోజన్(Grifthorse Android Trojan) ప్రమాదకరమైనదని, వినియోగదారులు దీనిని వెంటనే తమ స్మార్ట్‌ఫోన్ నుండి తీసివేయాలని కోరింది.

లేటెస్ట్‌గా గూగుల్ నిషేధించిన యాప్స్ విషయానికి వస్తే, “మ్యాజిక్ ఫోటో ల్యాబ్ – ఫోటో ఎడిటర్”, “బ్లెండర్ ఫోటో ఎడిటర్-ఈజీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్”, “పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్-2021”. ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే మాత్రం వెంటనే డిలేట్ చెయ్యాలని కోరుతుంది గూగుల్. ఈ మాల్వేర్.. ఫిషింగ్ లింక్స్ పంపిస్తూ.. ఆఫర్లంటూ ఊరించి, పాపప్స్ క్లిక్ చేయగానే.. బ్యాంక్ డిటెయిల్స్, ఏటీఎం కార్డు డిటెయిల్స్, నెట్ బ్యాకింగ్ డిటెయిల్స్ తస్కరించి.. అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంది.

ఇప్పటికే మీరు ఈ యాప్స్ వాడి ఉంటే మాత్రం.. వెంటనే యాప్స్ డిలీట్ చేయండి. తర్వాత ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను మార్చుకోండి. ఫోటో ఎడిటింగ్ యాప్స్ అంటే చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తారు. అందుకే ఈ మార్గాన్నే వారు ఎంచుకుంటున్నారు.