ఏప్రిల్ 6 నుంచి పనిచేయదు: మీ ఫోన్‌లో GPS అప్‌డేట్‌ చేసుకోండి

ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లదే హవా. ప్రతి స్మార్ట్ ఫోన్ డివైజ్ లో జీపీఎస్ అందుబాటులోకి వచ్చేసింది. లోకేషన్ ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే తెలుసుకునే టెక్నాలజీ ఉంది. 

ఏప్రిల్ 6 నుంచి పనిచేయదు: మీ ఫోన్‌లో GPS అప్‌డేట్‌ చేసుకోండి

ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లదే హవా. ప్రతి స్మార్ట్ ఫోన్ డివైజ్ లో జీపీఎస్ అందుబాటులోకి వచ్చేసింది. లోకేషన్ ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే తెలుసుకునే టెక్నాలజీ ఉంది. 

ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లదే హవా. ప్రతి స్మార్ట్ ఫోన్ డివైజ్ లో జీపీఎస్ అందుబాటులోకి వచ్చేసింది. లోకేషన్ ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే తెలుసుకునే టెక్నాలజీ ఉంది. మీ మొబైల్ డివైజ్ లో జీపీఎస్ సర్వీసు వాడుతున్నారా? అయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి. లేదంటే కొన్నిరోజుల్లో జీపీఎస్ సర్వీసులు ఆగిపోతాయట. లోకేషన్ బేసిడ్ సర్వీసులకు శాటిలైట్ ఆధారంగా పనిచేసే GPS దే కీ రోల్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ హోం డివైజ్ ల్లో ఎక్కువగా జీపీఎస్ సర్వీసులను వాడుతుంటారు.

ఈ సర్వీసుతో ఎన్నో కంపెనీలు తమ బిజినెస్ ను రన్ చేస్తున్నాయి. వెదర్ అప్ డేట్స్ ఇలా ఎన్నో బిజినెస్ లకు జీపీఎస్ తప్పనిసరిగా మారిపోయింది. రానున్న రోజుల్లో GPS బేసిడ్ డివైజ్ ల్లో సర్వీసులు నిలిచిపోనున్నాయి. ది రిజిస్టర్ నివేదిక ప్రకారం.. 2019 ఏప్రిల్ 6 నుంచి GPS డివైజ్ లలో సర్వీసులు ఆగిపోనున్నాయి. మీ డివైజ్ లను ముందుగానే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

లేదంటే.. జీపీఎస్ సర్వీసులను వినియోగించుకోలేరు. భూమిపై ఉన్న నేవిగేషన్ సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి సోలార్ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. జీపీఎస్ సిస్టమ్స్ ను రీసెట్ చేస్తుండమే ఇందుకు కారణంగా తెలిపింది. Firmware అప్ డేట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకూ శాటిలైట్ నుంచి వెలువడే జీపీఎస్ సిగ్నల్స్ క్లాక్ టైం స్టాప్ .. Week నంబర్ అనుసంధానంగా పనిచేస్తున్నాయి. GPS సిగ్నల్ లోని Week నంబర్ 10 డిజిట్ బైనరీ కోడ్ రూపంలో స్టోర్ అవుతోంది. బైనరీ కోడ్ 0 నుంచి 1,024 ఇలా ఫామ్ అయి ఉంటుంది.

ఈ విధానం ద్వారా జీపీఎస్ సిస్టమ్ ను 1,024 (19.6 సంవత్సరాలు) వీక్స్ గా లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే.. 1,024 వీక్స్ పూర్తి కాగానే.. జీపీఎస్ సిస్టమ్ క్లాక్.. ఆటోమాటిక్ గా రీసెట్ అయి మళ్లీ 0 నుంచి కౌంటింగ్ ప్రారంభవుతుంది. గతంలో జీపీఎస్ క్లాక్ 1999, ఆగస్టు 21న రీసెట్ అయింది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ GPS clock రీసెట్ కానుంది. 

2019, ఏప్రిల్ 6న GPS క్లాక్ సిస్టమ్ మరోసారి రీసెట్ కాబోతుంది. ఈసారి బైనరీ కోడ్ 10కి బదులుగా 13 డిజిట్ ఉండనుంది. ఇందులో 8వేల 192 వారాలు లేదా 157.5 సంవత్సరాల వరకు లెక్కించవచ్చు. ఈ కొత్త బైనరీ కోడ్ ద్వారా శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వెలువడి GPS క్లాక్ లోకేషన్ సమయాన్ని కౌంట్ చేస్తాయి. ఆ సమయంలో మీ GPS సిస్టమ్ అప్ డేట్ చేయకుంటే.. లోకేషన్ బేసిడ్ సర్వీసులకు ఆటంకం ఏర్పడుతుంది. దీనిపై ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు జీపీఎస్ డివైజ్ తయారీదారులు ఫ్రిమ్ వేర్ అప్ డేట్ ప్యాచ్ ను ప్రవేశపెట్టనున్నారు.

2010 తర్వాత రిలీజ్ అయిన జీపీఎస్ డివైజ్ ల్లో ఈ కొత్త బైనరీ కోడ్ విధానం పర్ ఫెక్ట్ గా పనిచేస్తుందని నివేదిక చెబుతోంది. మీలో ఎవరైనా పాత GPS బేసిడ్ సిస్టమ్ ను వాడుతున్నట్టయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.. మీ డివైజ్ తయారీదారులు అప్ డేట్ ను రిలీజ్ చేయకుంటే మాత్రం.. సిస్టమ్ లో కొన్ని సీరియస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 6 తరువాత మీ సిస్టమ్ లో వారంలో మరో ఆదివారం ఉండదు. 

Read Also :డేంజరస్ యాప్ : మీ అకౌంట్ లో డబ్బు మాయం

Read Also :పాక్ పని ఖతం: భారత్ కు ఇజ్రాయిల్ సైనిక సహకారం