Jio vs Airtel vs Vi Plans : నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు 30 రోజులు కాకుండా 28 రోజులే ఎందుకు ఉంటాయంటే?

Jio vs Airtel vs Vi Plans : టెలికం వినియోగదారులు ఎప్పుడైనా నెలవారీ రీఛార్జ్‌లకు సంబంధించి ఒక విషయాన్ని గమనించారా? సాధారణంగా ప్రతినెలలో 30 రోజుల నుంచి 31 రోజులు ఉంటాయి. కానీ, టెలికం కంపెనీలు ఆఫర్ చేసే నెలవారీ రీచార్జ్ ప్లాన్లు 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీని ఆఫర్ చేస్తున్నాయి.

Jio vs Airtel vs Vi Plans : టెలికం వినియోగదారులు ఎప్పుడైనా నెలవారీ రీఛార్జ్‌లకు సంబంధించి ఒక విషయాన్ని గమనించారా? సాధారణంగా ప్రతినెలలో 30 రోజుల నుంచి 31 రోజులు ఉంటాయి. కానీ, టెలికం కంపెనీలు ఆఫర్ చేసే నెలవారీ రీచార్జ్ ప్లాన్లు 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీని ఆఫర్ చేస్తున్నాయి. నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిస్తే.. 28 రోజుల పాటు వ్యాలిడిటీ అయ్యే ప్లాన్‌లను ఎక్కువగా చూస్తాము. కానీ, ఇలా ఎందుకు ఉంటాయంటే.. క్యాలెండర్ నెలల్లో ఫిబ్రవరికి మినహా అన్ని ఇతర క్యాలెండర్ నెలలు 30, 31 రోజులు ఉంటాయి. అలాంటప్పుడు మనకు రెండు రోజులు తక్కువ వ్యాలిడిటీ ఎందుకు వస్తుందో తెలుసా? 28 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్లపై వినియోగదారులు ఏడాదికి13 సార్లు రీఛార్జ్ చేసుకోవాలి. 12 నెలల పాటు 28 రోజుల నెలవారీ ప్లాన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లు 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి.

365 రోజుల్లో ఏడాదికి 29 రోజులు తక్కువ.. అందుకే వినియోగదారులు నెలవారీ ప్లాన్ పూర్తి చేసేందుకు అదనంగా మరో ప్యాక్ రీఛార్జ్ చేస్తారు. తద్వారా టెల్కోలు అదనంగా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తాయి. ఎంత ఎక్కువ ఉండొచ్చంటే… జూలై 2022 నాటికి, Airtelకి 35.48 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ వినియోగదారులు ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకుంటే.. కంపెనీ దాదాపు రూ.6,350 కోట్లు ఆర్జిస్తుంది. అదేవిధంగా రిలయన్స్ జియో (Reliance Jio)కు దాదాపు 40.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Here is why Jio, Airtel, Vi offer monthly plans for 28 days and not 30 days

28 రోజుల్లో దాదాపు రూ. 8,527 కోట్లను ఆర్జిస్తుంది. నాల్గవ రీఛార్జ్‌లో వినియోగదారులు కేవలం 336 రోజుల సర్వీసును మాత్రమే పొందుతారు 84-రోజుల వ్యాలిడిటీతో క్వార్టర్ ప్లాన్‌లు కూడా అలాగే ఉంటాయి. వివిధ ఆపరేటర్లు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను వేర్వేరు ధరల పరిధిలో ఉంటాయి. మీరు చౌకైన ప్లాన్‌ని ఎంచుకుంటే.. టెల్కోలు వ్యాలిడిటీని మరింత తగ్గిస్తాయి. Reliance Jio, Airtel, Vi ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 28 రోజుల ప్లాన్‌ల అందిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

* 28 రోజుల వ్యాలిడిటీతో జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ. 209, రూ. 239, రూ. 299, రూ. 419 వంటి మరిన్ని ప్లాన్లు ఉన్నాయి.
* 28 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ. 179, రూ. 265, రూ. 299, రూ. 359, రూ. 399, రూ. 449 అందుబాటులో ఉన్నాయి.
* Vi 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ. 299, రూ. 399, రూ. 499, రూ. 601 అందుబాటులో ఉన్నాయి.

అయితే, 12 నెలలకు బదులు 13 నెలలు రీఛార్జ్ చెల్లించాల్సిన వినియోగదారుల అభ్యర్థనపై TRAI నోటీసును రిలీజ్ చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నెలవారీ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని టెల్కోలను ఆదేశించింది.

క్యాలెండర్ నెలలోని 30 లేదా 31 రోజులతో సంబంధం లేకుండా నెలవారీ వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌ను అందించడం టెలికాం ఆపరేటర్‌లకు తప్పనిసరి చేసింది. ట్రాయ్ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం నెల వ్యాలిడిటీని అందిస్తుంది. Airtel, Vi నెలవారీ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.

Read Also : Jio Vs Airtel Vs Vodafone : జియో టు వోడాఫోన్.. రూ. 200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!

ట్రెండింగ్ వార్తలు