హానర్ 400 ప్రో వచ్చేస్తోంది.. నథింగ్ ఫోన్ 3 కంటే బెటర్‌గా ఉంటుందా? కొన్ని రోజులు ఆగి ఎందుకు కొనొచ్చంటే?

ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధరల మాటేంటి?

హానర్ 400 ప్రో వచ్చేస్తోంది.. నథింగ్ ఫోన్ 3 కంటే బెటర్‌గా ఉంటుందా? కొన్ని రోజులు ఆగి ఎందుకు కొనొచ్చంటే?

Updated On : July 16, 2025 / 8:18 AM IST

ధర ఎక్కువున్నా ఫర్వాలేదు.. మంచి ఫోన్‌ కొనాలని భావిస్తున్నవారికి హానర్ 400 ప్రో, నథింగ్ ఫోన్ 3 5జీ స్మార్ట్‌ఫోన్లు బాగా నచ్చుతున్నాయి. హానర్ 400 ప్రో ప్రపంచవ్యాప్తంగా 2025 మే 22న లాంచ్ అయింది. అయితే, భారత్‌లో హానర్ 400 ప్రో అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు.

త్వరలోనే భారత మార్కెట్లోనూ లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భారత మార్కెట్లో హానర్ 400 ప్రోకు పోటీగా నథింగ్ ఫోన్ 3 5జీ స్మార్ట్‌ఫోన్ ఉంది. హానర్ 400 ప్రో మార్కెట్లోకి వచ్చే వరకు ఆగాలా? లేక నథింగ్ ఫోన్ 3 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేయొచ్చా?

హానర్ 400 ప్రో, నథింగ్ ఫోన్ 3 5జీ స్మార్ట్‌ఫోన్లు మంచి స్పెసిఫికేషన్లతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. కెమెరాలు, శక్తిమంతమైన చిప్‌సెట్లు, వేగవంతమైన చార్జింగ్ సామర్థ్యం కావాలనుకునే వారికి ఇవి ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.

ప్రాసెసర్
హానర్ 400 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ 3.3 గిగాహెర్ట్జ్ వేగంతో ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ తో మల్టీటాస్కింగ్ కి బాగుంటుంది. నథింగ్ ఫోన్ 3లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 4 ప్రాసెసర్ 3.2 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేస్తుంది. దీనిలో 12 జీబీ ర్యామ్‌తో పాటు 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. రెండు ఫోన్లలో మంచి పనితీరు ఇస్తున్నప్పటికీ, పవర్‌లో హానర్ ప్రాసెసర్ కొంచెం ముందుంటుంది.

Also Read: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం

డిస్‌ప్లే, బ్యాటరీ
హానర్ 400 ప్రోలో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, 460 పిపీఐ స్పష్టత, పంచ్ హోల్ కట్‌ఔట్ ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వచ్చింది.

నథింగ్ ఫోన్ 3లో 6.67 అంగుళాల ఎల్‌టీపీఎస్ అమోలెడ్ స్క్రీన్, గోరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పిడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ లభిస్తుంది. డిస్‌ప్లే, పరంగా నథింగ్ ముందుంటే, బ్యాటరీ సామర్థ్యం, చార్జింగ్ వేగం పరంగా హానర్ బాగుంది.

కెమెరా
హానర్ 400 ప్రోలో మూడు బ్యాక్‌ కెమెరాలు: 200 ఎంపీ, 50 ఎంపీ, 12 ఎంపీ, ఓఐఎస్ తో ఉన్నాయి. ఫ్రంట్‌ సైడ్ 50 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4కే వీడియో రికార్డింగ్ చేస్తుంది.

నథింగ్ ఫోన్ 3లో మూడు బ్యాక్ కెమెరాలు (50 ఎంపీ), ఓఐఎస్ తో సమంగా పని చేస్తాయి. ఫ్రంట్ కెమెరా 50 ఎంపీతో ఉంది. ఇది 4కే వీడియోను 60 ఎఫ్‌పీఎస్ తో తీస్తుంది.

ధర
హానర్ 400 ప్రో ప్రారంభ ధర రూ.64,990. నథింగ్ ఫోన్ 3 ధర రూ.79,999. ధర మధ్య తేడా రూ.15,000 ఉంది. హానర్ 400 ప్రో ఇంకా ఇండియాలో విడుదల కాలేదు కాబట్టి ప్రత్యేక ఆఫర్లు లేవు. కానీ అప్‌డేట్ కోసం అలర్ట్ పెట్టుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3 కొంతవరకు ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ప్లాన్‌లతో లభించవచ్చు. పెద్దగా తగ్గింపు ఆఫర్లు లేవు.