Honor Play 60 Series
Honor Play 60 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. హానర్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m సిరీస్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్స్, 6,000mAh బ్యాటరీతో వస్తాయి. 13MP ప్రైమరీ బ్యాక్ కెమెరాలు, 5MP సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి.
ఈ ఫోన్‌లు 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీకి సపోర్ట్ చేస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు కొత్త బటన్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఒకే క్లిక్‌తో కొన్ని ఫంక్షన్‌లను వేగంగా యాక్సస్ చేయొచ్చు. హానర్ ప్లే 60, ప్లే 60m ఫోన్లు ప్రస్తుతానికి చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి అనేదానిపై క్లారిటీ లేదు.
హానర్ ప్లే 60 సిరీస్ ధర, కలర్ ఆప్షన్లు :
చైనాలో హానర్ ప్లే 60 ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర CNY 1,199 (సుమారు రూ. 14,100) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8GB + 256GB వేరియంట్ CNY 1,399 (సుమారు ధర రూ. 16,400) వద్ద అందుబాటులో అయింది. మరోవైపు, హానర్ ప్లే 60m మోడల్ 6GB + 128GB వెర్షన్ CNY 1,699 ధర (సుమారు రూ. 19,900), అయితే, 8GB + 256GB, 12GB + 256GB కాన్ఫిగరేషన్‌లు వరుసగా CNY 2,199 (సుమారు రూ. 25,800), CNY 2,599 (సుమారు రూ. 30,500)గా లభ్యమవుతున్నాయి.
త్వరలో హానర్ సిరీస్ ఫోన్లు చైనా ఈ-స్టోర్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. ముఖ్యంగా బేస్ హానర్ ప్లే 60 మోయాన్ బ్లాక్, యులాంగ్ స్నోయ్, జియావోషన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అయితే, హానర్ ప్లే 60m ఇంక్ రాక్ బ్లాక్, జాడే డ్రాగన్ స్నో, మార్నింగ్ గ్లో గోల్డ్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.
హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m ఫోన్లు స్పోర్ట్ 6.61-అంగుళాల HD+ (720×1,604 పిక్సెల్స్) టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, 1,010నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, డీసీ ఫ్లికర్-ఫ్రీ డిమ్మింగ్, లో బ్లూ లైట్, నేచురల్ లైట్ ఐ ప్రొటెక్షన్, రీడర్ మోడ్‌తో ఉంటాయి.
ఈ హ్యాండ్‌సెట్‌లు ఎఆర్ఎమ్ G57 ఎంసీ2 జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoC, 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ద్వారా పవర్ పొందుతాయి. అంతేకాదు.. ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్OS 9.0 స్కిన్‌తో వస్తాయి.
కెమెరాల విషయానికి వస్తే.. హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m రెండూ f/1.8 ఎపర్చర్‌తో 13MP ప్రైమరీ రియర్ సెన్సార్‌లు, f/2.2 ఎపర్చర్‌తో 5MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ కెమెరాలు 1080p రిజల్యూషన్ వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి.
హానర్ ప్లే 60 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు ఏఐ ఆధారిత ఇమేజింగ్, ప్రొడక్టవిటీ, సెక్యూరిటీ ఫీచర్లతో వస్తాయి. అంతేకాదు.. లెఫ్ట్ సైడ్ ఎడ్జ్‌లో ఫిజికల్ బటన్ కూడా ఉంటుంది. వినియోగదారులు ఒకే క్లిక్‌తో కాల్స్ చేయడం, బ్రైట్‌నెస్ అడ్జెస్ట్ చేయడం వంటివి చేయొచ్చు.
హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m వేరియంట్‌లు రెండూ 5V/3A వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయని హానర్ తెలిపింది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి.
IP64 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉంటాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, OTG, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లు (163.95 x 75.6 x 8.39mm) సైజుతో పాటు ఒక్కొక్కటి 197 గ్రాముల బరువు ఉంటాయి.