సింపుల్ ప్రాసెస్ : అమెజాన్ అకౌంట్లో email ఎలా మార్చాలంటే? 

  • Published By: sreehari ,Published On : February 7, 2020 / 01:49 AM IST
సింపుల్ ప్రాసెస్ : అమెజాన్ అకౌంట్లో email ఎలా మార్చాలంటే? 

Updated On : February 7, 2020 / 1:49 AM IST

అమెజాన్ అకౌంట్ వాడుతున్నారా? మీ అకౌంట్లో పాత ఈమెయిల్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? కొత్త ఈమెయిల్ ఎలా అప్ డేట్ చేయాలో తెలియదా? ఇదిగో ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో ప్రతి యూజర్ తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత ఆ పాత మెయిల్ స్థానంలో మరో కొత్త ఈమెయిల్ యాడ్ చేయాలనుకుంటే ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చు.

అందుకు మీరు చేయాల్సిందిల్లా ఒకటే.. ముందుగా అమెజాన్ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లండి. ఒకవేళ మీరు మొబైల్ లేదా డెస్క్ టాప్ PC ద్వారా అయితే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో amazon.in వెబ్ సైట్లోకి sign in అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు అకౌంటుకు సంబంధించిన లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. 

* యూజర్ అకౌంట్లో Settings వెళ్లగానే Account & Lists ఆప్షన్ ఉంటుంది.
* ఇక్కడ Your Account అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ Click చేయండి.
* ఇప్పుడు Login & security పై Click చేయండి.
* మీ అమెజాన్ అకౌంట్ లాగిన్ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
* మీకో లిస్ట్ కనిపిస్తుంది. అందులో Email ఆప్షన్ Edit పై క్లిక్ చేయండి.
*  కొత్త ఈమెయిల్ అడ్రస్ రెండు సార్లు ఎంటర్ చేశాక.. మళ్లీ మీ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
* ఇక్కడే మీకు క్యాప్చా కూడా అడుగుతుంది. అల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్లను ఎంటర్ చేయండి.
* Save Changes బటన్ పై Click చేయండి.
* Done బటన్ పై క్లిక్ చేయగానే Login & security పేజీకి వెళ్తుంది. 
* ఇక్కడ మీరు కొత్తగా యాడ్ చేసిన ఈమెయిల్ చూడొచ్చు.

ఒకసారి అమెజాన్ అకౌంట్లో కొత్త ఈమెయిల్ అడ్రస్ అప్ డేట్ అయ్యాక అప్పటినుంచి మీరు ఏది ఆర్డర్ చేసిన కొత్త మెయిల్ ఐడీకే అప్ డేట్స్ వస్తుంటాయి. లాగిన్ ఇష్యూ తలెత్తకుండా ఉండేందుకు ఇదివరకే లాగిన్ అయిన బ్రౌజర్లలో అవసరమైతే.. మీ కొత్త లాగిన్ ఇన్ఫర్మేషన్ అప్ డేట్ చేసుకోవచ్చు.