Mobile Appలు ఫోన్‌లో నుంచి తీసేసినా అకౌంట్‌లోనే..

Mobile Appలు ఫోన్‌లో నుంచి తీసేసినా అకౌంట్‌లోనే..

Android device

Updated On : December 27, 2019 / 10:16 AM IST

ఆండ్రాయిడ్ ఫోన్2లో వద్దనుకున్న యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక అక్కడితో అయిపోయిందనుకోవద్దు. అది మీ అకౌంట్‌లోనే ఉంటుంది. ఉండిపోతే ఏదో నష్టం ఉందని కాదు. కాకపోతే మీరు ఏ యాప్ వాడారో.. ఇతరులు తెలుసుకోవడం ఇట్టే సులువైపోతుంది. లేదా మీరే పాత యాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేసుకోవాలనిపిస్తే.. ఎక్కడ ఉంటుందో తెలుసా..

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Play store ఓపెన్ చేయండి. 
స్క్రీన్‌లో కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. అప్పుడొక మెనూ వస్తుంది. అందులో My apps & games మీద నొక్కండి. 
అక్కడ నాలుగు ఆప్షన్‌లు Updates, Installed, Library, Beta కనిపిస్తాయి. 
Library మీద క్లిక్ చేస్తే మీరు ఆ Google accountతో ఎప్పుడు ఏ యాప్ వాడారో అన్నీ వివరాలు వచ్చేస్తాయి. 
అక్కడ ఉన్న Install బటన్ మీద నొక్కితే రీ ఇన్‌స్టాల్ అవుతుంది. లేదంటే అక్కడే ఉన్న’×’ మీద నొక్కితే శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది. 

మరింకెందుకు ఆలస్యం.. మీ ఫోన్‌లో గ్యాప్ కోసం cachesని క్లియర్ చేసుకోవడంతో పాటు ఈ యాప్ సమాచారాన్ని కూడా తుడిచిపెట్టేయండి.