మీ ఐఫోన్‌లో ఫొటోలను పూర్తిగా ఎలా హైడ్ చేయాలో తెలుసా?

hide photos on iPhone : మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్‌లో ఫొటోలను ఇతరుల కంట పడకుండా ఎలా దాచుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఐఫోన్ లో ఫొటోలను పూర్తిగా హైడ్ చేయొచ్చు.. మీ మెయిన్ కెమెరా రోల్ లో ఫొటోలు ఉన్నా ఇతరులకు కనిపించకుండా దాచిపెట్టొచ్చు. అవసరమై నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఫొటోలను దాచుకోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.
ప్రైవేటు ఫొటోలు కావొచ్చు.. ఇతరులను సర్ ప్రైజ్ చేసే ఫొటోలు కావొచ్చు.. ఎలాంటి ఫొటోలైన సులభంగా మీ ఫోన్ లోనే దాచిపెట్టొచ్చు. ఫొటోలను హైడ్ చేసేందుకు ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్లలో ఇన్ బుల్ట్ సిస్టమ్ ఫీచర్ అమర్చింది. దీని ద్వారా ఆల్బమ్‌లోని ఫొటోలను ఈజీగా హైడ్ చేసుకోవచ్చు. Hidden అనే పేరుతో ఉంటుంది.. కానీ, లేటెస్ట్ iOS 14 అప్ డేట్ ఫోన్లలో ఉంది. ఈ ఫోన్లలో Hidden Album అనే ఫీచర్ ద్వారా ఫొటోలను భద్రపరుచుకోవచ్చు.
How to hide photos on iPhone
– మీ ఐఫోన్‌లో Photos app ఓపెన్ చేయండి.
– ఏ ఫొటోను హైడ్ చేయాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి.
– ఆ ఫొటోను ఓపెన్ చేశాక ఎడమవైపు కింది భాగంలో బాక్స్ అండ్ యారో (box-and-arrow)పై క్లిక్ చేయండి.
– కింది వరుసలో ఐకాన్లలో Hide అనే ఐకాన్ కనిపించే వరకు స్ర్కోల్ చేయండి.
– ఆ ఐకాన్ చూడటానికి రెండు ఇమేజ్ లతో ఒక strikethrough లైన్ కనిపిస్తుంది.
– దానిపై Tap చేయండి.. Photos Feed లో ఎంచుకున్న ఫొటోలు హైడ్ అయిపోతాయి.
– ఆల్బమ్ లోని ఇలానే మల్టీపుల్ ఫొటోలను హైడ్ చేసుకోవచ్చు.
– ఫొటోలు లేవని వర్రీ కావొద్దు.. మీ ఫొటోలు ఏమి డిలీట్ కాలేదు.
– హైడ్ చేసిన ఫొటోలను ఓపెన్ చేయాలంటే కిందిభాగంలో Albums Tabపై Tap చేయండి.
– మీ ఆల్బమ్ ఫొటోలు అన్నీ ఓపెన్ అవుతాయి.
– ఆ పేజీని కుడి నుంచి కిందికి స్ర్కోల్ చేయండి. అక్కడ మీకు Hidden ఫోల్డర్ కనిపిస్తుంది.
– Recently Deleted అనే Other Albums పేరుతో కనిపిస్తుంది.
– ఇక్కడ మీరు హైడ్ చేసిన ఫొటోలన్నింటిని చూడొచ్చు.
– హైడ్ చేసిన ఫొటోలన్నింటిని తిరిగి Photos Feedలోకి రీస్టోర్ చేసుకోవచ్చు.
– రీస్టోర్ కోసం ఫొటోపై Tap చేయండి. కిందిభాగంలో ఎడమవైపు ఐకాన్ మరోసారి Tap చేయండి.
– కింది వరుసలోని ఆప్షన్లను Unhide బటన్ కనిపించేంతవరకు స్ర్కోల్ చేసి దానిపై Tap చేయండి.
– మీరు నిజంగా paranoid అయితే.. మీ ఐఫోన్ లో ఫొటోస్ యాప్ నుంచి Hidden ఫోల్డర్ హైడ్ చేసుకోవచ్చు.
– Settingsలోకి వెళ్లి Photosపై క్లిక్ చేయండి. Hidden Album దగ్గర అన్ టిక్ (untick) చేయండి.
– ఫొటోస్ ఫోల్డర్ నుంచి Hidden ఫోల్డర్ రిమూవ్ అయిపోతుంది. మళ్లీ కావాలంటే టిక్ చేస్తే సరిపోతుంది.