Merge EPF Accounts : మీకు PF అకౌంట్లు ఎన్ని ఉన్నా సరే.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా మెర్జ్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..!

Merge EPF Accounts : మీకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ EPF అకౌంట్లు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా మెర్జ్ చేసుకోవచ్చు. పాత PF అకౌంట్ ఫండ్స్ కొత్త పీఎఫ్ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి తెలుసుకోండి.

Merge EPF Accounts

Merge EPF Accounts : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీకు ఒకటి కన్నా ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? EPF అకౌంట్లన్నీ ఆన్‌లైన్‌లో ఒకే అకౌంట్‌కు విలీనం చేసుకోవాలి. వాస్తవానికి, ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది ఒక ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. ఉద్యోగులకు పన్ను ప్రయోజనాలతో పాటు మంచి సురక్షితమైన రాబడిని కూడా అందిస్తుంది.

ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులే. 20 మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ కంపెనీ అయినా ఉద్యోగులకు EPF ప్రయోజనాలను అందించవచ్చు. ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరినప్పుడు వారికి ఈపీఎఫ్ అకౌంట్ కింద ఒక పర్మినెంట్ UAN నెంబర్ కేటాయిస్తారు. అది ఎప్పటికీ మారదు. అయితే, చాలామంది ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు.

Read Also : Airtel IPL Offer : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఎయిర్‌టెల్ సూపర్ IPL ఆఫర్లు.. కేవలం రూ. 100కే జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌..!

ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఉద్యోగులు పాత UAN నెంబర్ కాకుండా కొన్నిసార్లు వేరే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో కొత్త (EPF) అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అప్పుడు మీ పాత పీఎఫ్ అకౌంట్లలో జమ అయిన డబ్బు అలానే ఉంటుంది. కొత్త పీఎఫ్ అకౌంట్లలోకి క్రెడిట్ కాదు.

అలాంటిప్పుడు పాత PF అకౌంట్లలో మీ డబ్బు ఆటోమాటిక్‌గా ట్రాన్స్‌ఫర్ కాదని గమనించాలి. మీరే మాన్యువల్‌గా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అన్ని అకౌంట్లను విలీనం చేయడం వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రెండు లేదా అంతకంటే ఎక్కువ EPF అకౌంట్లను ఆన్‌లైన్‌లో ఎలా విలీనం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • EPFO అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో Sign in చేయండి.
  • ‘Oneline Services’ అనే సెక్షన్ కింద ‘One Member-One EPF Account’ ఎంచుకోండి.
  • ఫోన్ నంబర్, UAN నంబర్ వంటి అన్ని వివరాలను నింపండి.
  • ‘Generate OTP’పై క్లిక్ చేయండి.
  • OTP ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
  • కొత్త విండో Pop-Up ఓపెన్ అవుతుంది.
  • మీరు మెర్జ్ చేసే PF అకౌంట్ల వివరాలను డిక్లరేషన్‌కు (Agree) చేసి (Submit)పై క్లిక్ చేయండి.

మీ వివరాలను పంపిన తర్వాత మీ ప్రస్తుత యజమాని మెర్జ్ రిక్వెస్ట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం తర్వాత, EPFO ​​మీ రెండు పీఎఫ్ అకౌంట్లను ప్రాసెస్ చేసి విలీనం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీరు పోర్టల్‌లో బ్యాంకు స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు. ఇమెయిల్ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ EPF అకౌంట్లను ఆన్‌లైన్‌లో ఈజీగా మెర్జ్ చేయొచ్చు. సింపుల్‌గా ఒక ఇమెయిల్ పంపితే చాలు.. PF అకౌంట్లు ఎన్ని ఉన్నా ఒకేసారి మెర్జ్ చేయవచ్చు.

Read Also : Best Mileage Bikes : అధిక మైలేజీ అందించే 5 బెస్ట్ సూపర్ బైక్స్ మీకోసం.. ట్యాంక్ ఫుల్ చేశారంటే.. నెలంతా సిటీ మొత్తం చుట్టేయొచ్చు..!

మీరు చేయాల్సిందిల్లా.. మీరు విలీనం చేసే EPF అకౌంట్ల వివరాలను (uanepf@epfindia.gov.in)కు ఇమెయిల్ పంపండి. మీ ప్రస్తుత, గత UAN నెంబర్ కూడా అందులో పేర్కొనాలి. మీ రిక్వెస్ట్ వెరిఫై చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ మీ పాత UAN అకౌంట్లను ఇన్‌యాక్టివ్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మునుపటి నుంచి ప్రస్తుత UANకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు క్లెయిమ్‌ను సమర్పించాలి.