Instagram Account : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పొరపాటున డేటా డిలీట్ అయిందా? ఇలా ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు!
Instagram Account : ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అత్యంత పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రతిరోజూ మిలియన్ల మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారు.

How to restore deleted content from your Instagram account
Instagram Account : ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అత్యంత పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రతిరోజూ మిలియన్ల మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఫొటోలను, పోస్ట్‌లను షేర్ చేయడానికి, స్టోరీలను క్రియేట్ చేయడానికి రీల్స్ (Reels), మరెన్నో చేసేందుకు అనుమతిస్తుంది. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఫొటో, వీడియో, రీల్‌ని డిలీట్ చేశారా? అయితే, ఆ డేటాను తిరిగి పొందాలనుకుంటున్నారా? మీకు తెలియకపోతే.. మీరు డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, రీల్స్, వీడియోలు, Instagram స్టోరీలను రీస్టోర్ చేయడానికి Instagram మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు డిలీట్ చేసేందుకు ఎంచుకున్న కంటెంట్ వెంటనే మీ అకౌంట్ నుంచి డిలీట్ చేయవచ్చు కానీ, ఇటీవల డిలీట్ చేసిన ఫొల్డర్‌కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇటీవల డిలీట్ చేసిన కంటెంట్ 30 రోజులు స్టోర్ అవుతుంది. ఆ తర్వాత అది ఆటోమాటిక్‌గా డిలీట్ అవుతుంది. Instagram స్టోరీల కోసం.. మీ స్టోరీల ఆర్కైవ్‌లో లేని టైమ్ లిమిట్ 24 గంటల వరకు ఉంటుంది.
ఆ 30 రోజులలో మీరు Android, iPhone డివైజ్ ద్వారా Instagram యాప్‌లో ఇటీవల డిలీట్ చేసిన మీ అకౌంట్ నుంచి ఆయా కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. దాన్ని రీస్టోర్ చేయవచ్చు లేదా శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు వంటి మీడియాకు మాత్రమే వర్క్ అవుతుందని గమనించాలి. Instagramలో డిలీట్ అయిన మెసేజ్‌లను రీస్టోర్ చేయడం సాధ్యం కాదని గమనించాలి. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.

How to restore deleted content from your Instagram account
* మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram ఓపెన్ చేయండి.
* మీ ప్రొఫైల్‌కి వెళ్లేందుకు దిగువ కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ ఫొటోను Tap చేయండి.
* ఎగువ కుడివైపున మరిన్ని ఆప్షన్లను Tap చేయండి.
* ఆ తర్వాత, యాక్టివిటీ కంట్రోల్స్‌పై ట్యాప్ చేసి, ఆపై మీ యాక్టివిటీపై Tap చేయండి.
* ఇటీవల డిలీట్ చేసిన వాటిపై Tap చేయండి.
* యూజర్లు ఇటీవల ఏ కంటెంట్‌ను డిలీట్ చేయకుంటే కింది ఆప్షన్లను చూడలేరని గమనించాలి.
* టాప్‌లో కంటెంట్ టైప్ Tap చేసి ప్రొఫైల్ పోస్ట్‌లు, రీల్స్, వీడియోలు, స్టోరీలను రీస్టోర్ చేయవచ్చు.
* ఆ తర్వాత, మీరు రీస్టోర్ చేయాలనుకునే ఫొటో, వీడియో లేదా స్టోరీని ట్యాప్ చేయండి.
* ఎగువ కుడివైపున మరిన్ని ఆప్షన్లను Tap చేయండి.
* ఆపై కంటెంట్‌ని రీస్టోర్ చేయడానికి Restore to Profile లేదా Restore అని Tap చేయండి.
* మీరు ఇప్పుడు మీ అకౌంట్లో రీస్టోర్ చేసిన మీడియాను చూడవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..