Whatsapp HD Photos : వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Whatsapp HD Photos : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. వాట్సాప్‌లో కాంటాక్ట్‌లకు HD ఫొటోలను పంపుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్ యూజర్లు యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలి. ఫొటోలను పంపేటప్పుడు స్టాండర్డ్, HD క్వాలిటీ మధ్య ఎంచుకోవచ్చు.

Whatsapp HD Photos : వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to send HD quality photos on WhatsApp in 5 simple steps

Whatsapp HD Photos : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (Whatsapp) అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఈ ఏడాదిలో లేటెస్ట్ HD ఫొటో ఫీచర్ ఇదే. వాట్సాప్ కొత్త ఫీచర్‌ సాయంతో యూజర్లు తమ కాంటాక్ట్‌లకు HD ఫొటోలను ఈజీగా పంపుకోవచ్చు. ఇప్పటివరకు, వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పంపిన ఫొటోలను కంప్రెస్ చేసేది.

అయితే, ఈ కొత్త ఫీచర్ రావడంతో యూజర్లు HD క్వాలిటీతో ఫొటోలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఫీచర్ అధికారికంగా రిలీజ్ అయిందని గమనించాలి. మీ వాట్సాప్‌లో HD క్వాలిటీ ఆప్షన్ చూడలేకపోతే.. మరికొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు త్వరలో HD క్వాలిటీ ఫొటో షేరింగ్ అందుబాటులోకి రానుంది.

Read Also : WhatsApp Share Screen : వాట్సాప్‌లో వీడియో కాల్స్‌తో ఇలా ఈజీగా స్ర్కీన్ షేర్ చేసుకోవచ్చు.. కానీ, తస్మాత్ జాగ్రత్త..!

ఈ ఫీచర్‌తో గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి మెసేజింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. రాబోయే కొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్ రిలీజ్ కానుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వాట్సాప్ యూజర్లు ఫొటోలను షేర్ చేసేందుకు స్టాండర్డ్, HD క్వాలిటీ అనే 2 ఆప్షన్లను పొందవచ్చు.

How to send HD quality photos on WhatsApp in 5 simple steps

How to send HD quality photos on WhatsApp in 5 simple steps

WhatsApp ద్వారా ఫొటోలను వేగంగా షేరింగ్ చేసుకోవచ్చు. ప్రామాణిక క్వాలిటీ ఫొటోలను పంపే డిఫాల్ట్ ఆప్షన్ కానుందని పేర్కొంది. వాట్సాప్ త్వరలో HD వీడియో ఫీచర్లను కూడా తీసుకురానున్నట్లు ధృవీకరించింది. అయితే ముందుగా, వాట్సాప్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులకు HD క్వాలిటీ ఫొటోలను ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం..

* ఈ కొత్త ఫీచర్ కోసం Google Play store, Apple App store ద్వారా యాప్‌ను అప్‌డేట్ చేయాలి.
* మీరు HD ఫొటోలను షేర్ చేయాలనుకునే వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి చాట్ చేయండి.
* అటాచ్‌మెంట్ ఎంపికపై క్లిక్ చేయండి. ప్రామాణిక, HD ఫోటోలు అనే 2 ఆప్షన్లను పొందవచ్చు.
* HD క్వాలిటీ ఫొటోలను పంపేందుకు రెండో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. HD క్వాలిటీ (2000×3000)
* Send ఆప్షన్ క్లిక్ చేయండి. మీ కాంటాక్ట్ ఫొటో HD క్వాలిటీతో పొందవచ్చు.

మీకు తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ ఉన్నప్పుడు.. మీరు ఫొటోను స్వీకరిస్తే.. స్టాండర్డ్ వెర్షన్‌ను ఉంచాలా లేదా HDకి అప్‌గ్రేడ్ చేయాలా అనేదానిని మీరు ఫొటో-బై-ఫొటో ఆధారంగా ఎంచుకోవచ్చుని కూడా వాట్సాప్ తెలిపింది.

Read Also : Realme Wireless Earbuds : రియల్‌మి 11 ఫోన్, 2 కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఆగస్టు 23నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?