Telegram Sign Up : టెలిగ్రామ్‌లో సిమ్ కార్డు లేకుండానే లాగిన్ కావొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
How to Sign Up on Telegram : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram)లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. టెలిగ్రామ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో SIM లేకుండానే Sign Up చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది.ఫ్రాగ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న బ్లాక్‌చెయిన్-పవర్డ్ నంబర్‌లను ఉపయోగించి లాగిన్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
How to sign up on Telegram without SIM card : A step-by-step guide
How to Sign Up on Telegram : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram)లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. టెలిగ్రామ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో SIM లేకుండానే Sign Up చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది.ఫ్రాగ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న బ్లాక్‌చెయిన్-పవర్డ్ నంబర్‌లను ఉపయోగించి లాగిన్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
ఫ్రాగ్మెంట్ అనేది అన్‌నౌన్ నెంబర్లు, యూజర్ల పేర్లను విక్రయించవచ్చు. ఓపెన్ నెట్‌వర్క్ లేదా TONపై ఆధారపడి పనిచేస్తుంది. ఆసక్తిగల యూజర్లు anonymous నెంబర్లు, యూజర్ల పేర్లను 16 డాలర్లకు కొనుగోలు చేయవచ్చు. SIM కార్డ్ లేకుండా టెలిగ్రామ్‌లో సైన్ అప్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ టెలిగ్రామ్ లేటెస్ట్ వెర్షన్ కాకపోతే.. యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి Google Play Store/Apple యాప్ స్టోర్‌కి వెళ్లండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో టెలిగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఆ తర్వాత, Get Started ఆప్షన్ Tap చేయండి.
* ఫ్రాగ్‌మెంట్ నుంచి కొనుగోలు చేసిన బ్లాక్‌చెయిన్-పవర్డ్ anonymous నెంబర్లను ఎంటర్ చేయండి.
* మీ అకౌంట్ ధృవీకరించేందుకు మీరు OTPని ఎంటర్ చేయాలి.
* ఫ్రాగ్మెంట్ Anonymous నంబర్‌పై OTP పంపవచ్చు.
* OTPని నమోదు చేసిన తర్వాత.. మీరు మీ అకౌంట్ సెటప్ చేయవచ్చు.
* SIM లేకుండా టెలిగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.

How to sign up on Telegram without SIM card : A step-by-step guide
టెలిగ్రామ్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. వీటిలో టాపిక్స్ 2.0 అన్ని చాట్‌లను ఆటోమాటిక్‌గా డిలీట్ చేయవచ్చు. తాత్కాలిక QR కోడ్‌లను పొందవచ్చు. టెలిగ్రామ్‌లో ఇప్పుడు 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల గ్రూపులకు అందుబాటులో ఉన్నాయి. గ్రూపుల్లో సొగసైన two-column mode మోడ్‌లో ఓపెన్ అవుతాయి.
మీరు మీ ఇతర చాట్‌లను మునుపటిలా త్వరగా యాక్సెస్ చేయవచ్చు. లేటెస్ట్ అంశానికి మారేందుకు యూజర్లు ప్రివ్యూలోని కొత్త బటన్‌ను Tap చేయవచ్చు. టెలిగ్రామ్ అన్ని కొత్త చాట్‌లలోని మెసేజ్‌లను ఆటోమాటిక్‌గా తొలగించేందుకు గ్లోబల్ ఆటో-డిలీట్ టైమర్‌ను సెట్ చేసే సామర్థ్యాన్ని యాడ్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే ఉన్న చాట్‌లను ప్రభావితం చేయదని చెప్పవచ్చు.
ఈ ఫీచర్ మీ ఆటో-డిలీట్ సెట్టింగ్‌లను ఇప్పటికే ఉన్న చాట్‌లలో దేనికైనా సులభంగా విస్తరించవచ్చు. అలా చేయాలంటే.. Settings > Privacy & Security > Auto-Delete Messages వెళ్లండి. టెలిగ్రామ్ లేటెస్ట్ అప్‌డేట్‌తో వస్తున్న మరో ఫీచర్ ఏమిటంటే.. మీ యూజర్ నేమ్ లేకపోయినా.. మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసినా తాత్కాలిక QR కోడ్‌ను రూపొందించవచ్చు. ఈ కోడ్‌ని స్కాన్ చేయడం వల్ల ఇతర టెలిగ్రామ్ యూజర్లు మీ ఫోన్ నంబర్ తెలియకుండానే మిమ్మల్ని కాంటాక్ట్‌గా యాడ్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
