యూపీఐ లైట్ ఎలా వాడాలి? గూగుల్ పే, ఫోన్‌పేలో పిన్ లేకుండా డబ్బులు ఎలా పంపాలి?
Tech Tips in Telugu : యూపీఐ లైట్ అనేది NPCI రెడీ ఫీచర్.. 'ఆన్-డివైస్ వ్యాలెట్' అని కూడా పిలుస్తారు. UPI PINను ఎంటర్ చేయకుండానే చిన్న బ్యాలెన్స్, పేమెంట్లను చేసేందుకు ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది.

Tech Tips in Telugu
Tech Tips in Telugu : టెక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్ 2022లో UPI Lite అనే కొత్త పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఒరిజినల్ UPI పేమెంట్ సిస్టమ్ సింప్లిఫైయిడ్ వెర్షన్ ప్రతిరోజూ చిన్న-వాల్యూ లావాదేవీలను చేసుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
బ్యాంక్ ప్రాసెసింగ్, మరిన్ని సమస్యల విషయంలో ఫెయిల్యూర్ సమస్యలతో పాటు UPI లైట్ UPI సింప్లిఫైయిడ్ వెర్షన్, తక్కువ-విలువ లావాదేవీల కోసం రూపొందించారు. సాధారణ UPI లావాదేవీల మాదిరిగా కాకుండా.. రోజువారీ లిమిట్ రూ. 1 లక్ష, UPI Lite లావాదేవీలు ఒక్కో లావాదేవీకి రూ. 200 మాత్రమే UPI లైట్‌ని ఉపయోగించవచ్చు. వినియోగదారులు ముందుగా లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ద్వారా UPI లైట్ అకౌంట్ డబ్బును లోడ్ చేయాలి.
అకౌంట్ సెటప్ చేసిన తర్వాత.. వినియోగదారులు తమ UPI లైట్ అకౌంట్ రోజుకు రెండుసార్లు రూ. 2వేలు వరకు యాడ్ చేయాలి. మొత్తం రోజువారీ లిమిట్ రూ.4వేలు వరకు ఉంటుంది. చిన్న, తరచుగా పేమెంట్లు చేయాలనుకునే యూజర్లకు యూపీఐ లైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
యూపీఐ లైట్ వినియోగదారులు తమ అకౌంట్ ఎప్పుడైనా మూసివేయవచ్చు లేదా తమ లైట్ అకౌంట్ నుంచి తమ బ్యాంక్ అకౌంట్‌కు ఒకే క్లిక్‌తో ఎలాంటి రుసుము లేకుండా డబ్బులను బదిలీ చేయవచ్చు. Google Pay, PhonePe, Paytmతో సహా పాపులర్ పేమెంట్ గేట్‌వేలలో UPI లైట్‌ని ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
GPayలో UPI లైట్‌ని ఎలా ఉపయోగించాలి :
* Google Pay యాప్‌ను ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై Tap చేయండి.
* Pay PIN Free UPI లైట్‌పై Tap చేయండి.
* మీ UPI లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును లోడ్ చేసేందుకు ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి.
* మీరు రూ. 2,000 వరకు లోడ్ చేయొచ్చు.
* డబ్బును యాడ్ చేయడానికి UPI లైట్‌కి సపోర్టు ఇచ్చే అర్హత గల బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి.
* డబ్బు లోడ్ చేయండి.
* మీ UPI లైట్ బ్యాలెన్స్‌కి డబ్బును లోడ్ చేసిన తర్వాత మీ UPI పిన్‌ను ఎంటర్ చేయకుండానే రూ. 200 వరకు పేమెంట్లు చేయవచ్చు.
* పేమెంట్ చేయడానికి మీ UPI పిన్‌ని ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తే UPI లైట్ ఆప్షన్ ఎంచుకోండి. మీ పేమెంట్ UPI లైట్ బ్యాలెన్స్ నుంచి తొలగించింది.
పోన్‌పేలో UPI లైట్‌ని ఎలా ఉపయోగించాలి :
* PhonePe యాప్‌ని ఓపెన్ చేయండి.
* మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌పై UPI లైట్‌ని నొక్కండి.
* మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కి, పేమెంట్ మెథడ్స్ సెక్షన్‌లో UPI లైట్‌ని కూడా Tap చేయొచ్చు.
* UPI లైట్‌పై Tap చేయండి.
* మీ UPI లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును యాడ్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి.
* మీరు రూ. 2,000 వరకు లోడ్ చేయొచ్చు.
* మీ UPI లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును లోడ్ చేసిన తర్వాత మీ UPI పిన్‌ను ఎంటర్ చేయకుండానే రూ.200 వరకు పేమెంట్లు చేయవచ్చు.
పేటీఎంలో యూపీఐ లైట్‌ని ఎలా ఉపయోగించాలి :
* పేటీఎం యాప్‌ని ఓపెన్ చేయండి.
* హోమ్ పేజీలో కనుగొని, ‘ఇంట్రడ్యూసింగ్ UPI లైట్’ పై క్లిక్ చేయండి.
* Paytm UPI Lite ద్వారా సపోర్ట్ చేసే లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి.
* UPI లైట్‌కి డబ్బుని లోడ్ చేయండి.
* డబ్బు లోడ్ చేసిన తర్వాత QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా UPI IDతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు రీసివర్ పేమెంట్ చేసుకోవచ్చు.