ICICI UPI Charges : బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. UPI పేమెంట్లపై ICICI బ్యాంకు కొత్త ఛార్జీలివే.. వారికి మాత్రమే..!
ICICI UPI Charges : ఆగస్టు 1 నుంచి యూపీఐ పేమెంట్లపై ఐసీఐసీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రభావం పడనుంది.

ICICI UPI Charges
ICICI UPI Charges : ఐసీఐసీఐ బ్యాంకు యూపీఐ చెల్లింపులపై కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ప్రధానంగా ICICI బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్ల (PAs) నుంచి లావాదేవీ (ICICI UPI Charges) రుసుములను వసూలు చేయబోతోంది.
ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. గతంలో, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ ఛార్జీలను వసూలు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు యూపీఐ చెల్లింపులపై పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి లావాదేవీ రుసుములను వసూలు చేయనుంది.
ఛార్జ్ ఎంతంటే? :
పేమెంట్ అగ్రిటేటర్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎస్క్రో అకౌంట్ వాడుతుంటే ప్రతి లావాదేవీపై 2 బేసిస్ పాయింట్లు (0.02శాతం) ఛార్జ్ విధిస్తారు. గరిష్ట పరిమితి ప్రతి లావాదేవీకి రూ. 6 చొప్పున ఉంటుంది. ఐసీఐసీఐలో ఎస్క్రో అకౌంట్ లేని పేమెంట్ అగ్రిగేటర్లకు 4 బేసిస్ పాయింట్లు (0.04శాతం) ఛార్జ్ అవుతుంది. గరిష్ట ఛార్జ్ ప్రతి లావాదేవీకి రూ. 10గా నిర్ణయించింది.
ఎవరిపై ఛార్జీలు ఉండవంటే? :
లావాదేవీ నేరుగా మర్చంట్ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంటులో సెటిల్ అయితే అలాంటి వారిపై ఎలాంటి ఛార్జీ విధించదు.
ఇతర బ్యాంకుల్లో కూడా ఛార్జీలు :
యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు గత 8 నెలల నుంచి 10 నెలలుగా UPI లావాదేవీలకు పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఈ ఛార్జీలు ఎందుకంటే? :
కేంద్ర ప్రభుత్వం యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను సున్నా వద్ద ఉంచినప్పటికీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకుల నుంచి స్విచ్ ఫీజును వసూలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు ఈ ఖర్చును పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి తిరిగి పొందుతున్నాయి.
వ్యాపారులపై ప్రభావం ఎంతంటే? :
పేమెంట్ అగ్రిగేటర్లు సాధారణంగా ప్లాట్‌ఫామ్ ఫీజులు, పేమెంట్ రుసుములు వంటి సర్వీసులకు వ్యాపారుల నుంచి ముందుగానే వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో ICICI కొత్త ఛార్జీల ప్రభావం భవిష్యత్తులో వ్యాపారులపై కూడా పడొచ్చు. యూపీఐ కస్టమర్లకు ఫ్రీగా ఉండొచ్చు. కానీ, బ్యాంకులు ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి రుసుము వసూలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నాయి.