Stock Market Today : ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు ఢమాల్.. జస్ట్ 15 నిమిషాల్లోనే రూ.5.5 లక్షల కోట్లు ఆవిరి..!

Stock Market Today
Stock Market Today : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆగస్టు 1 నుంచి భారతీయ దిగుమతులపై ట్రంప్ (Stock Market Today) 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించడంతో జూలై 31 (గురువారం)న భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
దాంతో దలాల్ స్ట్రీట్‌లో భయాందోళనలకు దారితీసింది. వాణిజ్య ఉద్రిక్తతలు అకస్మాత్తుగా పెరిగాయి. ఈ నేపథ్యలో స్టాక్ మార్కెట్లో ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పెట్టుబడిదారుల సంపద రూ.5.5 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.
భారత్ అమెరికాకు మిత్రదేశమైనా సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ టారిఫ్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడటంతో ఈరోజు సూచీలు ప్రారంభంలోనే బలహీనంగా ఉన్నాయి. నిఫ్టీ సైతం దాదాపు 180 పాయింట్లకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 300 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఈరోజు మార్కెట్లో భారీగా క్షీణత కనిపిస్తోంది.
గిఫ్ట్ నిఫ్టీ 24700 కన్నా 200 పాయింట్లు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 24,700 మార్క్ కన్నా దిగువకు పడిపోయింది. ఇటీవలి నెలల్లో ఇదే అత్యంత క్షీణతగా చెప్పవచ్చు. BSE డేటా ప్రకారం.. లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.85 లక్షల కోట్ల నుంచి రూ.453.35 లక్షల కోట్లకు పడిపోయింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది.
ట్రంప్ 25శాతం సుంకాల బెదిరింపు :
ట్రంప్ 25శాతం సుంకాల బెదిరింపు పెట్టబడిదారుల్లో మరింత ఆందోళన రేకిత్తించింది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించినందుకు భారత్‌పై పరోక్షంగా కూడా జరిమానా పడింది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఆందోళనలకు కూడా దారితీసింది. 16 ప్రధాన రంగాల సూచీలు రెడ్ కలర్‌తో ట్రేడ్ అవుతున్నాయి. చిన్న, మధ్యస్థ క్యాప్ స్టాక్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 1.25శాత మేర పడిపోయాయి.
వస్త్రాలు, ఔషధాలు, ఆటో స్పేర్ పార్టులు వంటి రంగాలలో ఎగుమతుల స్థాయిని బట్టి చూస్తే.. అమెరికా సుంకాల ప్రభావం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు, మార్కెట్ విశ్లేషకులు హెచ్చరించారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య చర్చలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. కొత్త అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ భారీ పతనం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుందా? లేదా చర్చల ద్వారా ముగిసిపోతుందో చూడాలి.