Infinix Note 60 Pro : వారెవ్వా.. కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో అదుర్స్.. 2 కలర్ ఆప్షన్లు కేక.. ధర ఎంతంటే?
Infinix Note 60 Pro : ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో ఎఫ్/1.59 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి.
Infinix Note 60 Pro
- ఫ్రాస్ట్ సిల్వర్, మిస్ట్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభ్యం
- కొత్త కలర్ వేరియంట్ల ధర రూ. 33,999గా ఉంది
- 6,500 mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా
Infinix Note 60 Pro : కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ కోసం చూస్తున్నారా? చైనాకు చెందిన ఇన్ఫినిక్స్ కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోను ఫ్రాస్ట్ సిల్వర్, మిస్ట్ టైటానియం అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు.
మెటాలిక్ ఫినిష్ ఇష్టపడే కస్టమర్లకు ఈ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో రియర్ కెమెరా యూనిట్లో ఎఫ్/1.59 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి.
నివేదికల ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లు, మోడ్రాన్ మెటాలిక్ టెక్స్చర్ ఆధారంగా రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఓషన్ బ్లూ, సోలార్ ఆరెంజ్, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లు ఉండేవి. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త కలర్ వేరియంట్ల ధర రూ. 33,999 నుంచి లభ్యమవుతుంది.
కొత్త కలర్ ఆప్షన్లతో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 3,999 విలువైన మ్యాగ్‌పవర్ స్పీకర్‌ను ఫ్రీగా అందిస్తారు. అంతేకాదు.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో, 5టీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డిస్ప్లే (1,208 x 2,644 పిక్సెల్స్) ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్సెట్, అడ్రెనో A810 జీపీయూతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరాలో ఎఫ్/1.59 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోలో 6,500mAh బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
